బాలయ్య మనస్సు బంగారం.. స్టార్ సింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పలు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకొని వార్తల్లో నిలిచారు.బాలకృష్ణకు కోపం ఎక్కువని పలు సందర్భాల్లో వార్తలు వస్తుంటాయి.

 Singer Smitha Revealed Unknown Facts About Nandamuri Balakrishna-TeluguStop.com

అయితే ఆయనతో పని చేసిన వాళ్లు మాత్రం ఆయన ఎంతో గొప్పవారని చెబుతూ ఉంటారు.ప్రముఖ సింగర్లలో ఒకరైన స్మిత బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బాలయ్య కష్టాల్లో ఉన్నవాళ్లకు ఏ విధంగా సాయం చేస్తారో స్మిత చెప్పుకొచ్చారు.

 Singer Smitha Revealed Unknown Facts About Nandamuri Balakrishna-బాలయ్య మనస్సు బంగారం.. స్టార్ సింగర్ ఆసక్తికర వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తనకు రెండు నెలల క్రితం ఒక జర్నలిస్ట్ కాల్ చేశారని అతని కొడుకు ఆరోగ్యం బాగాలేదని ఆ వ్యక్తిని బ్రతికించుకోవడం కొరకు అప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నారని స్మిత అన్నారు.

చికిత్స కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరం కాగా తనకు జర్నలిస్ట్ కాల్ చేయడంతో బాలకృష్ణ గారికి వీలు కుదిరితే రెండు నిమిషాలు కాల్ మాట్లాడగలరా అని మెసేజ్ పెట్టగా ఐదు నిమిషాల తర్వాత కాల్ వచ్చిందని స్మిత అన్నారు.

Telugu 105 Movie, Akhanda Movie, Balakrishan Helped Jounalist, Balakrishna Helping Nature, Boyapati Srinu, Gopichand Malineni, Nandamuri Balakrishna, Singer Smitha, Smitha About Balakrishna, Unknown Facts-Movie

బాలకృష్ణ ఫోన్ కాల్ లో తనకు రిపోర్ట్స్ పంపిస్తే తమ ఆస్పత్రి వైద్యుల ద్వారా సాయం చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారని ఆ తర్వాత ఆస్పత్రి వైద్యులు తనకు కాల్ చేసి రేపు పేషెంట్ ను ఆస్పత్రికి తీసుకురావాలని చెప్పారని ఈ విధంగా బాలకృష్ణ ఎంతోమందికి సహాయం చేశారని బాలకృష్ణ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని స్మిత వెల్లడించారు.

Telugu 105 Movie, Akhanda Movie, Balakrishan Helped Jounalist, Balakrishna Helping Nature, Boyapati Srinu, Gopichand Malineni, Nandamuri Balakrishna, Singer Smitha, Smitha About Balakrishna, Unknown Facts-Movie

కొంతమంది సెలబ్రిటీలు చేసింది చెప్పుకోవడానికి తెగ తాపత్రయపడతారు.అయితే బాలయ్య మాత్రం ఎంతోమందికి సహాయం చేసినా ఆ సహాయాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు.బాలయ్య ప్రస్తుతం అఖండ సినిమాలో నటిస్తుండగా బాలయ్య 105వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమా తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా ఒక సినిమా తెరకెక్కనుంది.

#Unknown Facts #SmithaAbout #Boyapati Srinu #Singer Smitha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు