నాగశౌర్యకి జోడీగా పాప్ సింగింగ్ సెన్సేషన్  

Singer Shirley Setia To Star Opposite Naga Shaurya, Tollywood, Bollywood, Pop Singer, Singing Sensation, Social Media - Telugu Bollywood, Pop Singer, Singing Sensation, Social Media

టాలీవుడ్ లో సోలో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న యువ హీరో నాగశౌర్య.ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు అవుతున్న కెరియర్ లో సోలో హీరోగా ఇప్పటికి సరైన బెంచ్ మార్క్ ని నాగశౌర్య చేరుకోలేకపోయారు.

TeluguStop.com - Singer Shirley Setia To Star Opposite Naga Shaurya

అందం, అభినయం ఉన్న కూడా లవర్ బాయ్ అనే ఇమేజ్ కారణంగా అతను అనుకున్న స్థాయిలో కమర్షియల్ హీరోగా ఎదగలేకపోయాడు.దీంతో సొంతం ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నాగశౌర్య తల్లి నిర్మాతగా వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు.

ఐరా ప్రొడక్షన్ లో మూడో నాలుగో సినిమా అనీష్ కృష్ణ దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతుంది.ఈ సినిమా ప్రారంభోత్సవం ఇప్పటికే జరిగిపోయింది.

TeluguStop.com - నాగశౌర్యకి జోడీగా పాప్ సింగింగ్ సెన్సేషన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపధ్యంలో తాజాగా ఈ సినిమా హీరోయిన్ ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది.

సోషల్ మీడియాలో తన సింగింగ్ టాలెంట్ గా బాగా పాపులర్ అయినా పాప్ సింగర్ షిర్లీ సెటియా హీరోయిన్ గా ఖరారు అయ్యింది.న్యూజిలాండ్ లో ఆక్లాండ్ కి చెందిన ఈ బ్యూటీ సింగర్ ఇప్పటికే తన పాప్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది.

ఇక ఇండియాలోకి వచ్చి మోడలింగ్ లో అడుగుపెట్టి, హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది.ఈ బ్యూటీ ఫోర్బ్స్ మ్యాగజైన్ లో కూడా చోటు దక్కించుకుంది.

మస్కా చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన షిర్లీ ప్రస్తుతం నికమ్మ అనే సినిమాలో నటిస్తుంది.ఇప్పుడు సౌత్ నాగశౌర్య లాంటి టాలెంటెడ్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశాన్ని ఈ అమ్మడు సొంతం చేసుకుంది.

సౌత్ లో ఫారిన్ బ్యూటీస్ లలో కొద్దిగా సక్సెస్ అయ్యింది అమీ జాక్సన్ మాత్రమే.మరి ఆమె తరహాలో షిర్లీ కూడా సక్సెస్ అవుతుందేమో చూడాలి.

#Pop Singer #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Shirley Setia To Star Opposite Naga Shaurya Related Telugu News,Photos/Pics,Images..