గాయని ఎస్ జానకిపై తప్పుడు ప్రచారం… క్లారిటీ ఇచ్చిన కొడుకు  

Singer S Janaki Death Fake News Family Clarifies - Telugu Bollywood, Fake News, Family Clarifies, Kollywood, Singer S Janaki Death Fake News, South Cinema, Tollywood

దశాబ్దాలుగా తన గొంతుతో సంగీత ప్రియులను ఓలలాడిస్తున్న ప్రముఖ గాయని ఎస్.జానకి.

 Singer S Janaki Death Fake News Family Clarifies

ఆమె గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ ఉంది.అయితే కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో చనిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయ్యాయి.

ఆమె ఆరోగ్యం క్షీణించింది అంటూ ప్రచారం జరిగింది.అయితే ఆమెతో అనుబంధం ఉన్న సినీ ప్రముఖులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ వదంతులకి మాత్రం ఫుల్ స్టాప్ పడలేదు.

గాయని ఎస్ జానకిపై తప్పుడు ప్రచారం… క్లారిటీ ఇచ్చిన కొడుకు-Movie-Telugu Tollywood Photo Image

ఈ నేపధ్యం ఆమె కుమారుడు మీడియా ముందుకి వచ్చి ఎస్ జానకి ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు.

ఎస్.

జానకి కొంత కాలం క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన మాట వాస్తవమే అయినా ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

నిజానికి వయస్సు మళ్ళిన సినీ ప్రముఖులపై కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారు.అవి కాస్తా వైరల్ అయిపోతాయి.

అలా చాలా మంది ప్రముఖులని బ్రతికుండగానే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజన్లు చంపేసి నివాళి అర్పించేశారు.ఇక ఎస్ జానకి విషయంలో కూడా 2016, 2017లోనూ ఇలాగే పుకార్లు వ్యాప్తి చేశారు.

అప్పుడు కూడా కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు.మరోసారి అలాంటి వార్తలని ప్రచారం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer S Janaki Death Fake News Family Clarifies Related Telugu News,Photos/Pics,Images..

footer-test