సీనియర్ గాయని, సౌత్ ఇండియా దిగ్గజ సింగర్ ఎస్ జానకి ఈ రోజు సాయంత్రం ఊహించని విధంగా ఇంట్లో గాయపడి హాస్పిటల్ లో చేరారు.కర్నాటక లో మైసూరు లో బంధువుల ఇంటికి వెళ్ళిన ఆమె ఊహించని విధంగా ఇంట్లో కాలు జారి పడిపోయింది.
దీంతో వెంటనే ఆమెని హాస్పిటల్ కి తరలించారు.
ఇదిలా ఉంటే ఆమె కాలుజారి పడటంతో తుంటి భాగంలో ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు.
ప్రస్తుతం ఆమెక శాస్త్ర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.ఇక ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలియజేసినట్లు సమాచారం.