బిగ్ బాస్ బ్యూటీతో రాహుల్ డేటింగ్.. పునర్నవికి ఝలక్..?

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ అషురెడ్డితో డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించారు. బిగ్ బాస్ షోలో రాహుల్ పాల్గొన్న సమయంలో పునర్నవి భూపాలంతో రాహుల్ సన్నిహితంగా మెలగగా వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

 Singer Rahul Sipligunj  Relationship With Bigg Boss Contestant Ashureddy, Bigg B-TeluguStop.com

రాహుల్, పునర్నవి అభిమానులు సోషల్ మీడియా వేదికగా రాహుల్, పునర్నవి పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా అషురెడ్డితో డేటింగ్ లో ఉన్నట్టు రాహుల్ ప్రకటించడం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

సింగర్ గా చిన్న వయస్సులోనే గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.బిగ్ బాస్ సీజన్ 4లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను బిగ్ బాస్ బజ్ ప్రోగ్రామ్ లో రాహుల్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు.

రాహుల్ పాడిన పాటలతో పాటు చేసిన ప్రైవేట్ ఆల్బమ్ లు సైతం అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్ కావడానికి ఒకరకంగా పునర్నవి రాహుల్ లవ్ ట్రాక్ కారణమని బిగ్ బాస్ అభిమానులు గతంలో అభిప్రాయపడ్డారు.అయితే పునర్నవితో రిలేషన్ షిప్ గురించి మాట్లాడని రాహుల్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తాను అషురెడ్డితో రియల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని చెప్పారు.

అషురెడ్డితో డిన్నర్ డేట్ కు వెళ్లిన రాహుల్ తాను సినిమా కోసమో, వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమో, ఇతర కారణాల వల్లో అషురెడ్డిని కలవలేదని అషురెడ్డి, తాను రియల్ రిలేషన్ షిప్ లో ఉన్నానని అన్నారు.

అయితే అషురెడ్డి మాత్రం రాహుల్ తో డేటింగ్ వార్తల గురించి స్పందించలేదు.కొందరు నెటిజన్లు మాత్రం రాహుల్ అషురెడ్డితో డేటింగ్ లో ఉన్నానని చెప్పి పునర్నవికి ఝలక్ ఇచ్చాడని అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube