సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు... వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ స్టార్ సింగర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంట ఘనంగా పెళ్లి వేడుకలు జరిగాయి.రాహుల్ సోదరుడు నిఖిల్(Rahul Brother Nikhil) వివాహం(Marriage) ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 Singer Rahul Sipliganj House Has A Grand Wedding Ceremony Details, Singer Rahul-TeluguStop.com

రాహుల్ సిప్లిగంజ్ సోదరుడు వివాహం హైదరాబాద్ లో ఎంతో ఘనంగా జరగడంతో ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి ఇండస్ట్రీలో రాజకీయరంగంలో భారీ బ్యాగ్రౌండ్ ఉందని తెలుస్తోంది.

ఈ వివాహ వేడుకకు ఎంతోమంది తెలంగాణ రాజకీయ నాయకులు మంత్రులు హాజరయ్యారు.

ఇక వీరందరితో కలిసి దిగిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతోమంది ఈ ఫోటోలు చూసి మనోడు బ్యాక్ గ్రౌండ్ మామూలుగా లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.అదేవిధంగా రాహుల్ సోదరుడు నిఖిల్ దంపతులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం వీరి తమ్ముడి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక రాహుల్ కెరియర్ విషయానికి వస్తే ఆయన ఇండస్ట్రీలో ఎలాంటి సక్సెస్ సాధించారో మనకు తెలిసిందే.

హైదరాబాద్ గల్లీ నుంచి ప్రపంచం మెచ్చే స్థాయికి ఈయన ఎదిగారని చెప్పాలి.సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాహుల్ అనంతరం బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలోకి వెళ్లారు.ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన వరుసగా సినిమా అవకాశాలను అందుకున్నారు.

అయితే తాజాగా రాహుల్ పాడిన నాటు నాటు(Naatu Naatu ) పాట అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందడమే కాకుండా ఆస్కార్ అవార్డు(Oscar Award) ను కూడా గెలుచుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా నాటు నాటు పాట ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయినటువంటి ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు.

ఒకవైపు పాటలు పాడుతూనే మరోవైపు ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube