మీటూ : ఆమెను ముద్దు పెట్టుకున్న మాట వాస్తవమే, కాని!     2018-10-12   09:50:34  IST  Ramesh P

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమం ఓ రేంజ్‌ దూసుకు పోతున్న విషయం తెల్సిందే. తనూశ్రీ దత్తా ఎప్పుడైతే తనపై నానా పటేకర్‌ లైంగిక దాడి చేశాడు అంటూ మీడియా ముందుకు వచ్చి చెప్పిందో అప్పటి నుండి ఇతరులు కూడా మీడియాల్లో తమపై జరిగిన లైంగిక దాడుల గురించి చెబుతున్న విషయం తెల్సిందే. తాజాగా తమిళ సింగర్‌ చిన్మయి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. వైరముత్తు అనే ప్రముఖ రచయితపై ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది.

తమిళంకు చెందిన ఒక సింగర్‌ తన మిత్రురాలు అయిన వ్యక్తిపై కన్నడ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్‌ లైంగిక ఆరోపణలకు పాల్పడ్డాడని, ఆమెను బలవంతంగా కౌగిలించుకుని, ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడని, ఆమె అందుకు అంగీకరించకుండా, అక్కడ నుండి వెళ్లి పోయిందని చిన్మయి చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. చిన్మయి వ్యాఖ్యలపై తాజాగా రఘు దీక్షిత్‌ స్పందించాడు.

ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమే అని, తాను ఒక పాట రికార్డింగ్‌ సమయంలో ఉద్దేగానికి లోనై ఆమెను కౌగిలించుకున్న మాట వాస్తవమే, ఆమెను ముద్దు కూడా పెట్టుకునేందుకు ప్రయత్నించాను. ఆ సమయంలో నా భార్య నాతో ఉండటం లేదు. అందుకే నా పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంది. అందుకే అప్పుడు అలా ప్రవర్తించాను, అప్పుడే ఆ సింగర్‌ కు నేను క్షమాపణలు చెప్పాను, ఇప్పుడు మరోసారి ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ రఘు దీక్షిత్‌ చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు కూడా నా భార్య నా వద్ద ఉండటం లేదు. ఈ సందర్బంగా ఆమెకు కూడా క్షమాపణలు చెబుతున్నాను, నేను అప్పుడు చేసింది తప్పే అంటూ రఘు దీక్షిత్‌ ఒప్పుకున్నాడు. చిన్మయిని కూడా ఇంటికి రమ్మని పిలిచాడట. అయితే ఆ విషయంపై మాత్రం స్పందించేందుకు నిరాకరించాడు. మొత్తానికి లైంగిక వేదింపుల విమర్శలు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో మొదటగా తన తప్పును ఒప్పుకున్న వ్యక్తిగా రఘు దీక్షిత్‌ నిలిచాడు. ఇంకా ఎంతో మంది కూడా ప్రస్తుతం లైంగిక వేదింపుల విమర్శలను ఎదుర్కొంటున్నారు. వారెవ్వరు కూడా ఈ విషయాన్ని ఒప్పుకునేందుకు ముందుకు రావడం లేదు.