గ్రామీ అవార్డుల రేసులో భారత సంతతి సింగర్  

ప్రపంచంలో సినిమాలకి వచ్చేసరికి అత్యుత్తమ అవార్డు ఆస్కార్ అయితే సంగీత ప్రపంచంలో అత్యుత్తమ అవార్డులుగా గ్రామీ అవార్డులు గురించి కచ్చితంగా చెప్పుకోవాలి.ఎంతో మంది పాపులర్ సింగర్స్ సంగీత ప్రపంచంలో అత్యుత్తమ అవార్డు అయిన గ్రామీ అందుకోవాలని అనుకుంటారు.

TeluguStop.com - Singer Priya Darshini Got Nominated For Grammy

గ్రామీ అవార్డుల రేసులో భారత్ నుంచి పోటీ పడి విన్నర్స్ గా నిలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.అయితే ఇప్పుడు ఒక భారతీయ మూలాలు ఉన్న గాయని గ్రామీ అవార్డుల రేసులో పోటీ పడుతుంది.

కర్ణాటక సంగీతానికి వెస్ట్రన్ మ్యూజిక్ మిక్స్ చేసి ఆమె రూపొందించిన ఆల్బం ఇప్పుడు గ్రామీ అవార్డుల రేసులో ఉంది.ఆమె పేరు ప్రియదర్శిని.

TeluguStop.com - గ్రామీ అవార్డుల రేసులో భారత సంతతి సింగర్-General-Telugu-Telugu Tollywood Photo Image

నాలుగేళ్ల వయస్సు నుంచి కర్ణాటక సంగీత పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టిన ఈమె చిన్న వయసులోనే కచేరీల్లో పాల్గొంది.ఆ తర్వాత వివిధ రకాల సంగీతాన్ని అభ్యసించారు.

న్యూయార్క్ లో సెటిలైన ప్రియదర్శిని అక్కడి పాశ్చాత్య సంగీతాన్ని ఎన్నో పాటలు, ట్రాక్స్ ఆలపించారు.

పెరల్ జామ్ జాక్ షిమబుకురో రాయ్ ఫ్యూచర్మేన్ వూటెన్ ఫిలిప్ లాసిస్టర్ జెఫ్ కఫిన్ వంటి ప్రముఖ సంగీత కళాకారులతో ప్రియ దర్శిని పని చేశారు.తాజాగా గ్రామీ అవార్డులకు బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బం విభాగంలో ప్రియదర్శిని తొలి ఆల్బమ్ పెరిఫెరీ నామినేట్ కావడంతో ప్రియదర్శినిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.ఈ ఆల్బంలో తొమ్మిది పాటలున్నాయి.

ఈ పాటలన్నీ కర్ణాటక సంగీతం అమెరికన్ పాప్ సమ్మేళనంతో ఉన్నాయి.ఈ అవార్డుకు ప్రియదర్శినితో పాటు గతంలో ఐదుసార్లు ఇదే అవార్డుకు నామినేట్ అయిన అనౌష్కా శంకర్ కూడా పోటీలో ఉన్నారు.

#Grammy #World Music

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Priya Darshini Got Nominated For Grammy Related Telugu News,Photos/Pics,Images..