పాట పాడలంటే తనతో పడుకోమన్నాడు..క్యాస్టింగ్ కౌచ్ పై సింగర్ ప్రణవి సంచలన విషయాలు...

తెలుగు ఇండస్ట్రీ లో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ఆర్టిస్టులు , హీరోయిన్ లు సంచలన వ్యాఖ్యలు వెల్లడించారు.క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా రంగం లో అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్నది అని చాలా సార్లు విన్నాం.

 Singer Pranavi About Casting Couch-TeluguStop.com

అవకాశాలను ఎరగా చూపి పడకసుఖం ఆశించే కొంతమంది నిజస్వరూపం బయటపడినప్పటికి , చాలా మంది ఇప్పటికి చీకటి బాగోతలు నడిపిస్తూ ఉన్నారు.హీరోయిన్ , క్యారక్టర్ ఆర్టిస్ట్ లను మాత్రమే కాకుండా పాటలు పాడే సింగర్స్ ని కూడా వదిలిపెట్టలేదు ఇండస్ట్రీ లోని కొంత మంది కామాంధులు.

పాట పాడలంటే తనతో పడుకోవాలని అసభ్యంగా ప్రవర్తించిన దర్శకుడి గురించి ఒక టీవీ షో లో సింగర్ ప్రణవి సంచలన నిజాలు బయటపెట్టింది.

పాట పాడలంటే తనతో పడుకోమన్నాడ

తన భర్త రఘ మాస్టర్ తో కలిసిన కొంతకాలం క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన సింగర్ ప్రణవి తన జీవితం లో జరిగిన చేదు సంఘటనల గురించి మాట్లాడుతూ తాను కూడా మీటూ బాధితురాలినే అంటూ చెప్పుకొచ్చింది.నువ్వు సినిమాలో పాట పాడాలి అనుకుంటే నాతో ఉండాలి , నైట్ అంత నాతో నువ్వు గడపాలి అని నీఛాతినీచంగా మాట్లాడాడు ఓ దర్శకుడు.నీ వయసు ఏంటి? నా వయసు ఏంటి? చెప్పుతీసుకుని కొడతా అని చెప్పా.ఆ సమయం లో తను ఇంటర్మీడియట్ చదువుతున్ననని పాటలు పాడటం కోసం ఎవరైనా పిలిస్తే వెళ్ళేదాన్ని అని ఆమె చెప్పింది.అప్పుడే ఆ దర్శకుడు తనతో పడుకుంటావా అని అడిగితే మీకు కొత్తగా పెళ్లైంది ఏం మాట్లాడుతున్నారు అంటే పెళ్లై మూడు నెలలు అయిపోయింది కదా , ఇప్పుడు నువ్వు నాతో పడుకో అన్నాడు.

అప్పుడు తను అతనితో చెప్పుతో కొడతా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అని జవాబిచ్చి అక్కడి నుండి వెళ్లిపోయా అంటూ చెప్పుకొచ్చింది.

తనకి ఇలాంటి అనుభవాలు చాలా ఎదురయ్యాయని ప్రతి దాన్ని దైర్యంగా ఎదుర్కొన్న అని తెలిపింది .ఇక తనకు రఘు తో పెళ్ళయాక ఇలాంటివి ఏమి జరగలేదు అంటూ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube