తన మధురమైన గానంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ‘భజన్ కింగ్’గా గుర్తింపు పొందిన ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్(80) కన్నుమూసారు.అనారోగ్యంతో గత కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
పంజాబ్లో జన్మించిన నరేంద్ర చంచల్ ఆధ్యాత్మిక భజనలతో పాటు పలు హిందీ పాటలు ఆలపించిన ఆయన, బాబి సినిమాలోని ‘బేషక్ మందిర్ మసీద్’ పాటకు గానూ ప్రతిష్టాత్మక అవార్డు కూడా గెలుచుకున్నారు.కాగా నరేంద్ర చంచల్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెటర్ హర్భజన్ సింగ్, గాయకురాలు లతా మంగేష్కర్ ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి ప్రకటిస్తూ, విచారం వ్యక్తం చేశారు.
వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్విటర్ వేదికగా సంతాపం ప్రకటించారు.ఇకపోతే చిన్న వయసు నుంచే భజన పాటలు పాడటం ప్రారంభించిన నరేంద్ర చంచల్ వాటితో పాటుగా అనేక హిందీ చిత్రాలలోనూ పాటలు పాడారు.
అందులో ‘బాబీ’ చిత్రంతో పాటు ‘ఆశ’, ‘అవతార్’, ‘రోటీ కపాడా ఔర్ మకాన్’ వంటి అనేక ఇతర హిందీ సినిమాల ద్వారా మంచి గాయకునిగా గుర్తింపు తెచ్చుకున్నారు.