'బుల్లెట్ బండి' పాట సినిమాలో కూడా రాబోతుందా!

ఈ మధ్య కాలంలో ఎవ్వరి నోటా విన్నా ఒకటే పాట.అదే బుల్లెట్ బండి.

ఈ పాటను చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు ఆలపిస్తున్నారు.ఈ పాట ఎప్పుడో వచ్చిన అంత పాపులర్ అవ్వలేదు.

కానీ ఒక పెళ్లి కూతురు తన పెళ్ళిలో వరుడు కోసం బుల్లెట్ బండి పాటకు స్టెప్పులు వేసింది.ఇక ఆ పెళ్లి కూతురు చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

ఇక అప్పటి నుండి ఆ పాటనే ఎవ్వరి నోటా విన్నా.ఈ పాటను మోహన భోగరాజు పాడి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లోనే పెట్టుకుంది.

Advertisement

ఇప్పటికే ఈ పాట 100 మిలియన్ వ్యూస్ దాటి పోయింది.ఈ పాట పాపులర్ అవవడం వల్ల మోహన భోగరాజుకు సినిమాలో కూడా పాడే అవకాశం వస్తుంది.

అంతేకాదు ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.ఇక ఈ పాట కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు.

వారి వారి సినిమాల్లో ఈ పాటను పెట్టుకుంటే వాళ్ళ సినిమా కూడా పాపులర్ అవుతుందని వారి ఉద్దేశం.అందుకే ఈ పాట కోసం రోజురోజుకూ పోటీ పెరిగి పోతుంది.

ఈ పాటను ఎన్ని లక్షలన్న ఇచ్చి దక్కించు కోవాలని చాలా మంది దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట.ఈ పాట ఎన్ని లక్షలన్న ఇచ్చి తమ సొంతం చేసుకుంటే తమ సినిమాల్లో వాడుకోవడం వల్ల ఆ పాట కారణంగా తమ సినిమా కూడా ప్రోమోట్ అవుతుందని వారు అనుకుంటున్నారు.ఈ విషయాన్నీ మోహన భోగరాజు ఒక ఇంటర్వ్యూ లో తెలిపింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

బుల్లెట్ బండి పాట హిట్ అవవడం వల్ల ఆ పాటను తమ సినిమాల్లో వాడుకోవడం కోసం చాలా మంది సినీ ప్రముఖులు ఆమెను సంప్రదించారట.కానీ ఇప్పుడు ఆమె ఎవ్వరికి ఇవ్వడానికి సిద్ధంగా లేదట.

Advertisement

బుల్లెట్ బండి పాటను తన యూట్యూబ్ ఛానెల్ లోనే ఉంచుకోవాలని అనుకుంటుందట.మొత్తానికి ఒక్కపాటతో సినిమాల్లో పాడే అవకాశం కూడా లభించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది.

తాజా వార్తలు