కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ మనో.. కారణమేమిటంటే?  

Singer Mano Cries on Stage, singer mano, akka evare athagadu, sudheer, rashmi, bala subramanyam , SP Balu Funerals, Dasara Event - Telugu Akka Evare Athagadu, Bala Subramanyam, Dasara Event, Rashmi, Singer Mano, Singer Mano Cries On Stage, Sp Balu Funerals, Sudheer

ఇటీవల కాలంలో ఈటీవీలో ప్రసారం అవుతున్న షోస్ ఎంత హైలెట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక పండుగ సీజన్లు వచ్చాయి అంటే కేవలం ఈటీవీనే కాదు జెమినీ టీవీ, మా టీవీ, జీ తెలుగు ఇలా అన్ని పండగ షోస్ స్టార్ట్ అయిపోతాయి.

TeluguStop.com - Singer Mano Cries On Stage Video Viral

ఇక అలానే ఇప్పుడు విజయదశమి సందర్భంగా ఈటీవీలో టీఆర్పీని ఓ రేంజ్ లో పెంచేందుకు అక్క ఎవరే అతగాడు? అంటూ ఓ ప్రోగ్రాం ని చేశారు.ఈ ప్రోగ్రాం ప్రోమోలు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయ్.

ఇక ఇప్పుడు ఆ వేడుకల్లో పాల్గొన్న సింగర్ మనో కన్నీళ్లు పెట్టుకున్నారు.పాట పాడుతూనే ఆయన ఒక్కసారిగా బాధకు గురయ్యారు.అది చూసిన పలువురు తారలు అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన కంట మాత్రం కన్నీరు ఆగలేదు.దానికి కారణం బాల సుబ్రహ్మణ్యం గారు.

TeluguStop.com - కన్నీళ్లు పెట్టుకున్న సింగర్ మనో.. కారణమేమిటంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందిన గాయకుడూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివలర్పిస్తూ నివాళులర్పిస్తూ మనో, ఉష గారు ”సూర్యుడే సెలవని” పాట పాడారు.అలా పాడుతున్న సమయంలోనే ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

ఇక అలా కన్నీళ్లు పెట్టుకున్న ఆయన బాల సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుతూ.”బాల సుబ్రహ్మణ్యం గారిని చూస్తూ ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుంచి పెరిగాను.అందర్నీ సమానంగా చూసే గొప్ప వ్యక్తి.ఈరోజు ఆయన మన మధ్య లేరంటే నిజంగా తట్టుకోలేకపోతున్నాను.కన్నీళ్లు ఆగట్లేదు” అంటూ చెప్పుకొచ్చారు సింగర్ మనో.అయితే సింగర్ మనో కన్నీళ్లు పెట్టుకోవడం, పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు బాలు గారి మరణం గురించి కన్నీళ్లు పెట్టుకోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.”ఆయన అంత్యక్రియలకు వెళ్లని మీరు ఇలా ఏడవడం ఏంటో? కచ్చితంగా టీఆర్పీ కోసమే” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Singer Mano #Sudheer #SingerMano #AkkaEvare #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Mano Cries On Stage Video Viral Related Telugu News,Photos/Pics,Images..