మంగ్లీ వైల్డ్‌ ఎంట్రీ ఒక గాలి వార్త  

singer mangli wildcard entry in bigg boss is a big fake news, singer mangli ,wild card entry, bigg boss4, eliminations - Telugu Bb4, Bigg Boss, Mangil In Bigg Boss, Mangli, Nagarjuna, Singer Mangli, Telugu Bigg Boss

తెలుగు బిగ్‌బాస్‌ ఏడు వారాలు పూర్తి చేసుకుని 8వ వారంలో అడుగు పెట్టింది.ఇప్పటి వరకు ఏడుగురు ఎలిమినేట్‌ అవ్వగా గంగవ్వ అనారోగ్య కారణాల వల్ల హౌస్‌ నుండి బయటకు వచ్చింది.

TeluguStop.com - Singer Mangli Wildcard Entry In Bigg Boss Is A Big Fake News

అంటే ఏడు వారాలు పూర్తి అయ్యప్పటికి మొత్తం 8 మంది బయటకు వచ్చారు.షో 50 రోజులు పూర్తి చేసుకుంది.

అంటే సగం రోజులు పూర్తి చేసుకుందన్నమాట.షో 100 నుండి 110 రోజుల వరకు ఉంటుంది.

TeluguStop.com - మంగ్లీ వైల్డ్‌ ఎంట్రీ ఒక గాలి వార్త-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

షో సగం పూర్తి అయిన సమయంలో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటూ ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ముగ్గురు వైల్డ్‌ ఎంట్రీ ఇచ్చారు.

వారిలో కుమార్‌ సాయి మరియు స్వాతిలు బయటకు వచ్చేశారు.ఇప్పుడు మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అని అది కూడా చాలా ఫేమస్‌ అయిన మంగ్లీని వైల్డ్‌ ఎంట్రీ ఇప్పించబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

షోకు ఎంత ప్రయత్నించినా కూడా రేటింగ్స్‌ రావడం లేదు.అందుకే ఆమెను ఎంట్రీ ఇప్పిస్తే ఖచ్చితంగా మంచి రేటింగ్‌ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి.
మీడియాలో వస్తున్న వార్తలు ఏమాత్రం నిజం కాదని స్టార్‌ మా వారు అంటున్నారు.గేమ్‌ సగం అయిన తర్వాత ఇప్పుడు కొత్త సభ్యులను వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా పంపించడం అనేది ఏమాత్రం కరెక్ట్‌ కాదు.

గేమ్‌ లో మంగ్లీని ఇన్వాల్వ్‌ చేసినా ఆమెను పాత ఇంటి సభ్యులు అంతా కూడా దూరం పెట్టే అవకాశం ఉంది.అంటే ఇప్పటి వరకు వారు కష్టపడి ఇన్ని రోజులు ఉన్నారు.

కాని ఆమె డైరెక్ట్‌గా 50 రోజులు పూర్తి చేసుకుంటుంది.ఆమె ఫైనల్‌ వరకు ఉండటం పెద్ద కష్టం ఏమీ కాదు.

అందుకే ఇంటి సభ్యులు ఖచ్చితంగా ఇప్పుడు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అంటే ఆమెకు సహకరించే అవకాశం తక్కువ అని ఒక వేళ ఆమె వెళ్లినా కూడా ఈ సమయంలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు పెద్దగా ఏమీ ఉండదు అంటున్నారు.ఆమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ అనేది పూర్తిగా గాలి వార్త అయ్యి ఉంటుందని అంతా నమ్మకంగా చెబుతున్నారు.

#Singer Mangli #MangilIn #Bigg Boss #Mangli #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Mangli Wildcard Entry In Bigg Boss Is A Big Fake News Related Telugu News,Photos/Pics,Images..