చెల్లి సాంగ్ సూపర్ సక్సెస్... ఇంద్రావతి గురించి చెబుతూ ఎమోషనలైన మంగ్లీ!

అదృష్టం ఉండాలే కానీ రాత్రికి రాత్రే జీవితాలు తారుమారు అవుతాయి.ఈ మాట ఎక్కువగా సినీ ఇండస్ట్రీలో వినబడుతూ ఉంటుంది.

 Singer Mangli On Success Of Indravati Chouhan Special Song In Pushpa Details,  S-TeluguStop.com

ఎందుకంటే చాలామంది సెలబ్రిటీలు అదృష్టం తలుపు తట్టడంతో ఏకంగా రాత్రికి రాత్రే స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.అలాగే నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి స్టార్ హోదా లోకి వెళ్ళిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు.

అయితే అదృష్టం తలుపు తడితే ఈ విధంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు.కేవలం నటుల జీవితాలు మాత్రమే కాదు సింగర్ ల జీవితాలు కూడా అప్పుడప్పుడు రాత్రికి రాత్రి మారిపోతూ ఉంటాయి.

అలాంటి వారిలో సింగర్ మంగ్లీ సోదరీ ఇంద్రావతి చౌహాన్ కూడా ఒకరు.ప్రస్తుతం ఈమే పేరు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్మోగిపోతోంది.

పుష్ప సినిమాలో సమంత అలరించిన  స్పెషల్ సాంగ్ కు” ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా” అంటూ తన గొంతుతో పాడి అందరినీ కట్టిపడేసింది.ఆ పాటలో ఆమె పాడటం ఒక ఎత్తు అయితే.

లిరికల్ వీడియోలో ఆమె ఇచ్చిన హావభావాలు మరొక ఎత్తు అని చెప్పవచ్చు.ఒక్క పాటతో ఇంద్రావతి చౌహాన్ జీవితం మారిపోవడంతో పాటు ఎక్కడ చూసినా కూడా ఆమె పేరు మార్మోగిపోతోంది.

ఇటీవలే పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంద్రావతి  లైవ్ లో పాడిన పాట, ఆమె సోదరి పాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఊ అంటావా అనే పాటను మంగ్లీ కన్నడలో పాడగా.అదే పాటను తెలుగులో పాడి అదరగొట్టింది ఇంద్రావతి.అలా ఇంద్రావతి చౌహాన్ పేరు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

చెల్లికి ఈ రేంజ్ లో సక్సెస్ రావడంతో మంగ్లీ ఆనందంలో మునిగితేలుతోంది.

ఈ పాట నాలుగు రోజుల్లోనే మూడు కోట్ల వ్యూస్ ని  రాబట్టింది.ఊ అంటావా మావా అనే పాట ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.కంగ్రాట్స్ ఇంద్రావతి.

నీ డెబ్యూతోనే ఇంతటి సక్సెస్ అందుకున్నావ్.ఇకముందు రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని.

దేవి శ్రీ ప్రసాద్ సార్, సుకుమార్ సార్, అల్లుఅర్జున్ సార్ ఇలా అందరికీ థాంక్స్ అని మళ్ళీ తన సంతోషాన్ని పంచుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube