లుక్కు మార్చుకున్న స్టార్ సింగర్ మంగ్లీ.. బిగ్ బాస్ కోసమేనా..?

స్టార్ సింగర్ మంగ్లీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మంగ్లీ పాడిన పాటలు తక్కువే అయినా ఆ పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

 Singer Mangli New Look Photos Goes Viral In Social Media-TeluguStop.com

ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట మంగ్లీకు మంచి పేరును తెచ్చిపెట్టింది.గత కొన్ని నెలల నుంచి మంగ్లీ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొంటారని వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తన మాటలు, పాటలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మంగ్లీ తాజాగా తన లుక్కును పూర్తిగా మార్చుకున్నారు.మంగ్లీ కొత్త లుక్కును చూసిన నెటిజన్లు ఆమె బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 Singer Mangli New Look Photos Goes Viral In Social Media-లుక్కు మార్చుకున్న స్టార్ సింగర్ మంగ్లీ.. బిగ్ బాస్ కోసమేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మంగ్లీ కొత్త లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ఒకవైపు పాటలు పాడుతూనే యూట్యూబ్ వీడియోల ద్వారా మంగ్లీ నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Telugu Bigg Boss Season 5, Love Story, Mangli In New Look, New Look, Photos Goes Viral, Sarangadariya, Singer Manglee, Social Media, Tradition Look, Viral Look Mangli-Movie

మంగ్లీ నిజంగా బిగ్ బాస్ షోలో పాల్గొంటారో లేదో తెలియాలంటే ఆమె అధికారికంగా స్పందించి స్పష్టత ఇచ్చేవరకు ఆగాల్సిందే.బిగ్ బాస్ షోలో పాల్గొని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.సంప్రదాయ లుక్ లో ఎక్కువగా కనిపించే మంగ్లీ లుక్ ను పూర్తిగా మార్చుకోవడంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు.యూనిక్ వాయిస్ తో మంగ్లీ తన హవాను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.

Telugu Bigg Boss Season 5, Love Story, Mangli In New Look, New Look, Photos Goes Viral, Sarangadariya, Singer Manglee, Social Media, Tradition Look, Viral Look Mangli-Movie

మంగ్లీ కొత్త లుక్కులో మరింత అందంగా కనిపిస్తున్నారని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.మంగ్లీ సన్నిహితులు మాత్రం టీవీ షోలు, సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న మంగ్లీ బిగ్ బాస్ షోలో పాల్గొనకపోవచ్చని కామెంట్లు చేస్తున్నారు.మరో మూడు నెలల్లో బిగ్ బాస్ షో సీజన్ 5 నాగార్జున హోస్ట్ గా ప్రారంభం కానుందని తెలుస్తోంది.

#Social Media #Tradition Look #Sarangadariya #Singer Manglee #New Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు