భావోద్వేగానికి గురైన మంగ్లీ.. జీవితానికి ఇంకేం కావాలంటూ..?

ఈ మధ్య కాలంలో లవ్ స్టోరీ సినిమాలోని సారంగదరియా పాట పాడటం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మంగ్లీ.న్యూస్ ఛానల్ యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన మంగ్లీ సింగర్ గా ఎదిగారు.

 Singer Mangli Emotional Comments Her Photos Karnataka Bus, Emotional Comments, K-TeluguStop.com

మంగ్లీ పాటలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి.క్లాస్, మాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మంగ్లీ పాటలను పాడుతుండటం గమనార్హం.

అల వైకుంఠపురములో సినిమాలోని రాములో రాములా పాట పాడిన సింగర్ కూడా మంగ్లీనే కావడం గమనార్హం.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంగ్లీ పాటలు పాడారు.

కన్నడలో మంగ్లీ రాబర్ట్ అనే సినిమాలో పాటలు పాడగా ఆ పాట కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్టైంది. రాబర్ట్ సినిమాతో మంగ్లీ అభిమానులకు చేరువ కాగా కొంతమంది అభిమానులు బస్సులపై మంగ్లీ ఫోటోలను అతికించి అభిమానాన్ని చాటుకోవడం గమనార్హం.

సోషల్ మీడియాలో బస్సుల మీద ఉన్న మంగ్లీ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.ఈ విషయం మంగ్లీ దృష్టికి రావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కన్నడిగులు తనపై చూపిస్తున్న ప్రేమకు సంతోషపడిన మంగ్లీ ఈ జీవితానికి ఇంకేం కావాలని సదా ప్రేమను కోరుకుంటానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.మరోవైపు కర్ణాటకలో మస్కి అనే ప్రాంతంలో జరుగుతున్న బై ఎలక్షన్స్ లో మంగ్లీ జోరుగా ప్రచారం చేశారు.

Telugu Karnataka Bus, Views, Mangli-Movie

తాండా భాషలో మాట్లాడిన మంగ్లీ అక్కడి ఓటర్లను బాగానే ఆకర్షించారు.రోజురోజుకు పెరుగుతున్న గుర్తింపు ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.ఆమె ప్రచారానికి కూడా అక్కడ విశేష ఆదరణ లభించడం గమనార్హం.రాబోయే రోజుల్లో మంగ్లీ తన పాటల ద్వారా ఇతర భాషల్లో సైతం గుర్తింపును సంపాదించుకుంటారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube