మనస్సు మార్చుకున్న సింగర్ మంగ్లీ.. ఆ షోకు ఓకే చెప్పినట్టేనా?

సింగర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న మంగ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.సినిమా పాటలతో పాటు యూట్యూబ్ లో కూడా పాటల ద్వారా కూడా మరింత ఫేమస్ అవుతున్నారు.

 Singer Mangli Changed Her Mind Why Because-TeluguStop.com

మంగ్లీ యూట్యూబ్ ఛానల్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుండగా ఆమె పాడిన పాటలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.అయితే గత కొంతకాలంగా మంగ్లీ పేరు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

మంగ్లీ బిగ్ బాస్ షోలో కచ్చితంగా పాల్గొంటారని ఆమె అభిమానులు కూడా భావిస్తున్నారు.బిగ్ బాస్ షోలో ప్రతి సీజన్ లో ఒక సింగర్ కచ్చితంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

 Singer Mangli Changed Her Mind Why Because-మనస్సు మార్చుకున్న సింగర్ మంగ్లీ.. ఆ షోకు ఓకే చెప్పినట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సీజన్ లో మంగ్లీ దాదాపుగా కన్ఫామ్ అయ్యారని సమాచారం.సెప్టెంబర్ నెల నుంచి బిగ్ బాస్ షో ప్రారంభం కానుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో మంగ్లీ పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు.

Telugu Bathu Kamma Songs, Bigg Boss Show, Compulsroy Contenstant, Mind Changed, Singer Mangli, Tollywood, Yotube-Movie

గతంలో మంగ్లీ సన్నిహితులు బిగ్ బాస్ షోలో మంగ్లీ పాల్గొనకపోవచ్చని చెప్పినా మంగ్లీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని బిగ్ బాస్ షోలో కచ్చితంగా పాల్గొంటారని కూడా వార్తలు వస్తుండటం గమనార్హం.మంగ్లీ పాడిన బోనాల పాటలో అభ్యంతర పదాలు ఉన్నాయని కొన్ని టీవీ ఛానెళ్లు డిబేట్లు నిర్వహించగా కొంతమంది సినీ ప్రముఖులు సైతం కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

Telugu Bathu Kamma Songs, Bigg Boss Show, Compulsroy Contenstant, Mind Changed, Singer Mangli, Tollywood, Yotube-Movie

బిగ్ బాస్ నిర్వాహకులు సైతం మంగ్లీ బిగ్ బాస్ షోలో పాల్గొంటే ఆమె ఈ షోకు కచ్చితంగా ప్లస్ అవుతుందని భావిస్తున్న సంగతి తెలిసిందే.ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీల జాబితాలో యాంకర్ రవి, ప్రముఖ ఛానెల్ యాంకర్ ప్రత్యుష, లోబో ఉన్నారని సమాచారం.మంగ్లీ ఈ షోలో ఖచ్చితంగా పాల్గొంటారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

#Bigg Boss Show #Mind Changed #Singer Mangli #Yotube

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు