మహిళలను అక్కడు వెళ్లొద్దు అంటున్న జేసుదాసు  

singer jesudas sensational coments on womens - Telugu Sabarimala Jesudasu Singer Songs Kerala Movie Artist Ladies Women She Deeksha Ayya Swamy Temple

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇప్పటికి వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఆలయంలోకి మహిళా భక్తులు కాంతామణి ప్రవేశించేందుకు ప్రయత్నించడం, దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ వారిపై దాడులు చేయడం తదితర పరిణామాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

Singer Jesudas Sensational Coments On Womens

తాజాగా ఇదే అంశంపై ప్రముఖ గాయకుడు జ్యూసుదాసు స్పందించారు.శబరిమల ఆలయంలోకి మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.

ఒకప్పుడు అయ్యప్పస్వామి మాల వేసుకునే భక్తులు వారి ఇంట్లోని మహిళలను చూసేందుకు కూడా ఇష్టపడేవారు కాదని, ఇప్పుడు కాలం చాలా మారిపోయింది అంటూ జేసుదాసు ఆవేదన వ్యక్తం చేసారు.

మహిళలను అక్కడు వెళ్లొద్దు అంటున్న జేసుదాసు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఎవరైనా అమ్మాయి శబరిమలకు వెళ్తే దీక్షలో ఉన్న భక్తులు చూస్తారని, ఇది వారి మనసులో చెడు భావనను కలిగిస్తుందని జేసుదాస్ పేర్కొన్నారు.

అందుకే శబరిమలకు వెళ్లొద్దని మహిళలను వేడుకుంటున్నాను అంటూ జేసుదాసు చెప్పుకొచ్చారు.అసలు మహిళలు వెళ్లేందుకు దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయని, కానీ శబరిమల వెళ్లాలనే పట్టుదలను మహిళలు విడిచిపెట్టాల్సిందిగా ఆయన కోరారు.

దయచేసి మహిళలు అయ్యప్ప భక్తుల దీక్షను భగ్నం చేయవద్దు అంటూ ఆయన వేడుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Jesudas Sensational Coments On Womens Related Telugu News,Photos/Pics,Images..