రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ మృతి.. దిగ్ర్భాంతిలో సినీ ఇండస్ట్రీ  

Singer Geeta Mali Dead In Road Accident In Maharashtra-maharashtra,marathi Singer,road Accident,singer Geeta Mali

ఇటీవల టాలీవుడ్ యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కారుకు యాక్సిడెంట్ జరిగిన వార్తతో ఇండస్ట్రీ ఒక్కసారిగా అవాక్కయ్యింది.అయితే ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడటంతో సినీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో పేరుమోసిన సింగర్ ప్రాణాలు విడిచింది.ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

Singer Geeta Mali Dead In Road Accident In Maharashtra-maharashtra,marathi Singer,road Accident,singer Geeta Mali Telugu Viral News Singer Geeta Mali Dead In Road Accident Maharashtra-maharashtra Mara-Singer Geeta Mali Dead In Road Accident Maharashtra-Maharashtra Marathi Road

అయితే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది తెలుగు సింగర్ కాదులెండీ.మరాఠీలో ప్లేబ్యాక్ సింగర్‌గా పాపులర్ అయిన గీతా మాలీ తాజాగా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.మరాఠీలో మంచి ఫేమ్ సాధించిన ఈ సింగర్, ఇటీవల అమెరికా నుండి వచ్చిన గీతా మాలీ తన సొంత ఊరుకు వెళుతుండగా ముంబై-ఆగ్రా హైవేపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో గీతతో పాటు ఆమె భర్త కూడా తీవ్ర గాయాలపాలైయ్యాడు.

వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.అప్పటికే గీతా మాలీ ప్రాణాలు కోల్పోవడంతో మరాఠీ సినీ ప్రముఖులు ఆమె మృతిపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచిన గీతా మాలీ ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ప్రముఖులు కోరారు.