నాకో ఉద్యోగం కావాలంటున్న గద్దర్

ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణ ఉద్యమం తో పాటు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర ఉంది.ఎంతో మందిని తమ పాటలతో ఉత్సాహపరిచి ఉద్యమాలకు ఊపిరి పోసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

 Singer Gaddar Application For Job In Telangana Samskruthika Sarathi-TeluguStop.com

ఇక చాలాకాలంగా గద్దర్ సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు.అయితే అకస్మాత్తుగా ఆయన తనకు ఉద్యోగం కావాలంటూ తెలంగాణ సాంస్కృతిక సారధికి దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది.

తనకు ప్రస్తుతం 73 సంవత్సరాలని, తనకు ఏ విధమైన సర్టిఫికెట్లు లేవని అయినా తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ ఆయన కోరారు.

ఈ మేరకు సాంస్కృతిక సారథి నియామక కమిటీ సభ్యుడు శివ కుమార్‌ను కలిసి గద్దర్ దరఖాస్తును అందజేశారు.

దీనిపై స్పందించిన గద్దర్ ఉద్యోగానికి అప్లికేషన్​ పెట్టుకున్నది నిజమేనని, కళాకారుడిగా టెంపరరీ ఉద్యోగం అడిగానని తెలిపారు.దాదాపు 5 వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు.అందులో నేనొకడిని అంటూ వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube