తల్లితండ్రుల కోసం అంత చెయ్యాల్సిన పనిలేదు.. సింగర్ చిన్మయ్ షాకింగ్ సలహా?

సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె కెరీర్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

 Singer Chinmayi Suggestion-to Netizen On Parents Singer Chinmayi, Suggestion, Ne-TeluguStop.com

ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి.సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీకి ఎంత అయితే పాజిటివిటీ ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉందని చెప్పవచ్చు.

ఇక సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను సోషల్ మీడియా వేదికగా చిన్మయి ప్రశ్నిస్తుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఓ అమ్మాయి అడిగిన ప్రశ్నకు చిన్మయి తనదైన శైలిలో సమాధానం చెప్పారు.చాలామంది తననిఆరోగ్య విషయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ఒక అమ్మాయి మాత్రం తన వ్యక్తిగత విషయాన్ని తనతో పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమె తల్లిదండ్రుల కోసం ఏమైనా త్యాగం చేయవచ్చా? ముఖ్యంగా పెళ్లి విషయంలో అంటూ తనని సలహా అడిగారు.

Telugu Elgble Bachlore, Netizen, Chinmayi, Tollywood-Movie

ఈ ప్రశ్నకు చిన్మయి స్పందిస్తూ.

తనదైన శైలిలో సమాధానం చెప్పారు.తల్లిదండ్రుల కోసం అంత సాక్రిఫైస్ చేయాల్సిన పనిలేదు.

ముఖ్యంగా పెళ్లి విషయంలో నచ్చని వారిని చేసుకొని వారి కోసం మీ జీవితాన్ని త్యాగం చేయొద్దు.అంతగా వారికి అబ్బాయి నచ్చితే వారిని తెచ్చి ఇంటిలో పెంచుకోమనండి, దత్తత తీసుకోమన్నండి అంతే కానీ మీ జీవితాన్ని తల్లిదండ్రుల కోసం త్యాగం చేయాల్సిన పనిలేదంటూ షాకింగ్ సలహా ఇచ్చారు.

ఇకపోతే ఈమె అఖిల్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube