ఆ నటుడికి ఉత్తమ కామాంధుడి అవార్డ్ ఇవ్వండంటున్న ప్రముఖ సింగర్...

ఒకప్పుడు తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ఎంతలా కలకలం రేపింది చెప్పనవసరం లేదు.అయితే ఇందులో ముఖ్యంగా శ్రీ రెడ్డి, ప్రముఖ సింగర్ చిన్మయి, మరియు ఇతర ప్రముఖ నటినటులు తమపై జరిగిన అఘాయిత్యాలు గురించి మరియు సినీ పరిశ్రమలో  మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి గళం విప్పిన సంగతి తెలిసిందే.

 Singer Chinmayi Sripaada Comments On Lyricist Vairamuthu-TeluguStop.com

అయితే ఇందులో ప్రముఖ సింగర్ చిన్మయి తనను రాధిక శరత్ కుమార్ తమ్ముడు అయినటువంటి రాధ రవి లైంగికంగా వేధించాడని చేసిన ఆరోపణలకు గానూ ఆమె ప్రస్తుతం తమిళ పరిశ్రమ నుంచి బహిష్కరణకు గురైంది.అయితే తాజాగా తమిళ సినీ కవి అయినటువంటి వైర ముత్తు పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Chinmayi, Chinmayi Latest, Kollywood, Lyricistvaira, Tamil, Tollywood-Mov

సినీ పరిశ్రమలో పని చేసేటటువంటి తొమ్మిది మంది ఆడవాళ్ళను లైంగికంగా వేధించినటువంటి అతడికి ఉత్తమ కామాంధుడి అవార్డు ఇవ్వాలంటూ అతడిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వైర ముత్తు తమిళ సినీ పరిశ్రమలో అతడు చేసినటువంటి సేవలు గుర్తించి ఆయనను సత్కరించలని అనుకుంటున్న సంగతి తెలిసిందే.అయితే ఈ విషయం తెలుసుకున్న చిన్మయి అతడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరో సారి హీట్ టాపిక్ గా మారింది… అయితే ఈ వ్యాఖ్యలపై తమిళ సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube