పెళ్లిళ్లో జరిగేది వ్యాపారం.. ఆడదాని శరీరం అంటూ సింగర్ చిన్మయ్ షాకింగ్ కామెంట్స్?

Singer Chinmayi Shocking Comment About Arrange Marriage

సినిమా ఇండస్ట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె సింగర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకొని మీటు ఉద్యమం ద్వారా మహిళలపై జరిగే అరాచకాలు కోసం పోరాడుతూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

 Singer Chinmayi Shocking Comment About Arrange Marriage-TeluguStop.com

చిన్మయి మీటు ఉద్యమం ద్వారా ఎంతోమంది బడా నిర్మాతలు దర్శకుల భాగోతం బయటపెట్టింది.ఈ క్రమంలోనే చిన్మయిని సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది దారుణంగా కామెంట్లు చేస్తుంటారు.

చిన్మయి సామాజిక విషయాల గురించి స్పందించడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిలకు మహిళలకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు.అయితే సలహాలు సూచనలు కొంతమందికి నచ్చక ఈమెను దారుణంగా బూతులతో తిడుతుంటారు.

 Singer Chinmayi Shocking Comment About Arrange Marriage-పెళ్లిళ్లో జరిగేది వ్యాపారం.. ఆడదాని శరీరం అంటూ సింగర్ చిన్మయ్ షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే వీటన్నింటిని ఏమాత్రం లెక్క చేయని చిన్మయి ఎన్నోసార్లు మహిళలకు మద్దతు తెలుపుతూ ఉన్నటువంటి పోస్టులను పెడుతుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పెళ్ళిళ్ళు, వ్యాపారం అమ్మాయి శరీరం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ఈ సింగర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఈమె ఇచ్చే సలహాలు కొంతమంది అబ్బాయిలు నచ్చకపోవటం వల్ల ఈమె ట్రోలింగ్ గురవుతోంది.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఉదాహరణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్ గురించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు పెడుతుంటారు.అయితే ఆ కార్యక్రమాలు అన్నీ ప్రతి ఒక్క అబ్బాయికి సూచిస్తున్నట్లు కాదు అవి ఎవరికైతే వర్తిస్తాయో వారికి మాత్రమే వర్తిస్తాయి అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను కేవలం కొంతమందికి మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతున్నానని తెలిపారు.ఒక అమ్మాయి పడుతున్న కష్టాలను బహిరంగంగా బయట పెట్టడం వల్ల వాటిని తెలుసుకొని మరొక అమ్మాయి ఎంతో జాగ్రత్త పడుతుందని మరికొందరైతే వారి బిడ్డకు స్వేచ్ఛగా బ్రతికే హక్కును ఇవ్వకుండా, తన కాళ్ళపై నిలబడే అవకాశం కూడా తల్లిదండ్రులు తనకు ఇవ్వరంటూ తెలిపారు.అయితే కొంతమంది అమ్మాయికి అవగాహన వస్తే వారికి నచ్చిన వారిని వేరే క్యాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భావించే ఎంతోమంది తల్లిదండ్రులు తనకు ఇష్టం లేకపోయినా, తన క్యాస్ట్ అబ్బాయి ఎంత వెధవ అయినా కూడా ఎంతో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.

ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు అనేది స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా జరగడం లేదు పెళ్లిళ్లలో పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతుందని చిన్మయి ఈ సందర్భంగా వెల్లడించారు.అంతేకాకుండా ప్రస్తుత కాలంలో అమ్మాయి శరీరం కూడా వేధింపులకు గురవుతున్నట్లు ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఈ సందర్భంగా అమ్మాయిల గురించి చిన్మయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

#Love Marriages #Chinmayi #Arrange #Chinmayi #Society

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube