తెలుగువాళ్ళు బూతులు తిడుతున్నారని ఫీల్ అవుతున్న సింగర్  

Singer Chinmayi Says Telugu Audience Use Abusing Words - Telugu Chinmayi Says Telugu Audience Use Abusing Words, Kollywood, Samantha, South Audience, Tollywood

సింగర్ గా కంటే సమంతకి డబ్బింగ్ చెప్పడం ద్వారా తెలుగులో భాగా గుర్తింపు తెచ్చుకున్న సౌత్ ఇండియా సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సింగర్ చిన్మయి ఆ మధ్య తమిళ చిత్రపరిశ్రమలో ఒక ప్రముఖ పాటల రచయిత మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ఒక్కసారిగా సంచలనంగా మారింది.

 Singer Chinmayi Says Telugu Audience Use Abusing Words

ఆ తరువాత ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి తరుచుగా తన గొంతు వినిపిస్తుంది.అలాగే ఎక్కువగా ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటుంది.

దీంతో పాటు ఈ మధ్య కాలంలో సినిమాలలో సీనియర్ హీరోల రొమాన్స్ గురించి కూడా కాస్తా అపహాస్యం చేసే విధంగా వాఖ్యలు చేసింది.ఇలా తరుచుగా ఏదో ఒక వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటుంది.

తెలుగువాళ్ళు బూతులు తిడుతున్నారని ఫీల్ అవుతున్న సింగర్-Movie-Telugu Tollywood Photo Image

ఈమెకి సింగర్ గా, డబ్బింగ్ కళాకారినికిగా వచ్చిన గుర్తింపు కంటే ఈ వివాదాలతో మరింత ఎక్కువ గుర్తింపు వచ్చింది.ఇదిలా ఉంటే మరోసారి తెలుగు వాళ్ళు మీద ఈ భామ నోరుపారేసుకుంది.

తనకి సోషల్ మీడియాలో తనని తెలుగు ప్రేక్షకులు, నెటిజన్లు ఎక్కువగా బూతులు తిడుతూ ఉంటారని, కనీసం మర్యాద లేని పదాలు ఉపయోగించి బూతులతో కామెంట్లు పెడుతూ ఉంటారని వాఖ్యలు చేసింది.ఫ్యాన్స్ వార్ పేరుతో కొందరు శృతి మించి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారని, వారికి అలా బూతులు మాట్లాడటం అలావటైపోయింది అని అన్నది.

అయితే ఇలా అంటున్నారని ఏడుస్తూ కూర్చునే వ్యక్తిని తను కాదని, కచ్చితంగా నన్ను బాధిస్తే యాక్షన్ సీరియస్ గా ఉంటుందని చెప్పడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Chinmayi Says Telugu Audience Use Abusing Words Related Telugu News,Photos/Pics,Images..