'నా షర్ట్ లోపల ఏముందో చూస్తా అంటూ జేబులోపల చెయ్యి పెట్టి నీచంగా..' సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి     2018-10-08   11:24:33  IST  Sainath G

చిన్మయి…మంచి సింగర్ కంటే సమంత కి వాయిస్ ఇచ్చిన సింగర్ అంటే అందరు గుర్తుపడతారు అనుకుంట. ‘ఏమాయ చేశావే’ సినిమాలో హస్కీ వాయిస్‌తో సమంతకు డబ్బింగ్ చెప్పి సమంత కి కుర్రకారులు ఫ్లాట్ అవ్వడానికి పరోక్షంగా కారణంగా మారింది చిన్మయి. తర్వాత హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ను పెళ్లిచేసుకుంది. తనకు ఎనిమిదేళ్ల వయస్సు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగింది అని సోషల్ మీడియాలో ట్రెండవుతున్న #MeToo‌ లో భాగంగా తన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.

‘నాకు 8 లేదా 9 ఏళ్ల వయస్సు అనుకుంటా. నేను నిద్రపోతున్నాను. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్‌ సెషన్‌‌లో బిజీగా ఉంది. ఆ సమయంలో ఓ వ్యక్తి నా రహస్య భాగాలపై అసభ్యంగా తాకినట్టు నాకు అనిపించింది. వెంటనే లేచి, అమ్మా ఈ అంకుల్‌ చాలా చెడ్డవాడు అని చెప్పా. అది శాంతోమ్‌ కమ్యూనికేషన్స్‌ స్టూడియోలో జరిగింది. ఆ స్టూడియో ఇప్పటికీ ఉంది’’ అని పేర్కొంది. ఆ తర్వాత పదేళ్ల వయసులో డిసెంబరు మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఓ వ్యక్తి నన్ను అసభ్యంగా తాకాడని తెలిపింది. కొంతమంది తన షర్ట్ జేబుల్లో ఏముందో చూస్తా అంటూ చేతులు పెట్టేవారని తెలిపింది. ల్పౌక్ వంతెన వద్ద జరిగిన ఈవ్ టీజింగ్‌లో రోడ్డు ప్రమాదానికి గురై తన కుడి భుజానికి బలమైన గాయమైందని పేర్కొంది.

Singer Chinmayi opens up about her struggle in Me Too-Me Too,Singer Chinmayi,struggles

‘‘19 ఏళ్ల వయస్సులో సంఘంలో మంచి పేరున్న వ్యక్తి.. తన ఆఫీసుకు పిలిపించుకున్నాడు. నాతో అమ్మ కూడా వచ్చింది. అయితే, నన్ను ఒంటరిగా ఆఫీసులోకి రమ్మన్నాడు. అలా పిలిచినందుకు మాకు ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే ఆయన అలాంటి వ్యక్తి కాదని అనిపించింది. లోపలికి వెళ్లాక కౌగిలించుకుని పైకి ఎత్తాడు’’ అని తెలిపింది. మహిళలు ఎదుర్కొంటున్న చేదు అనుభవాలను సమాజానికి తెలియజేయడంలో భాగంగా ఆమె కూడా #MeToo ద్వారా తన అనుభవాలను పంచుకుంటూ వార్తల్లోకెక్కింది.