మహిళలపై దర్శకుడి కామెంట్స్.. ఏసుకున్న చిన్మయి  

Singer Chinmayi Fires On Director Bhagyaraj Comments On Women-director,kollywood News,singer Chinmayi,women

గతంలో మీటూ అంటూ సినీ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్‌పై సింగర్ చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి.సినిమా రంగంలోని చీకటి కోణాన్ని ఆమె బహిరంగం చేసిన విషయం తెలిసిందే.

Singer Chinmayi Fires On Director Bhagyaraj Comments On Women-director,kollywood News,singer Chinmayi,women Telugu Tollywood Movie Cinema Film Latest News-Singer Chinmayi Fires On Director Bhagyaraj Comments Women-Director Kollywood News Singer Women

ఆ తరువాత పలుసార్లు ఆమె సోషల్ మీడియాలో తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.కాగా తాజాగా మరోసారి ఆమె ఓ తమిళ డైరెక్టర్‌పై విరుచుకుపడింది.

తమిళంలో దర్శకుడు, నటుడు భాగ్యరాజ్ తాజాగా ఓ కామెంట్ చేశాడు.ఆడవారు చనువు ఇస్తేనే అబ్బాయిలు తప్పులు చేస్తారని ఆయన అన్నారు.

ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల కోసం భర్తలను, బిడ్డలను చంపుతున్న ఆడవారి సంఖ్య ఎక్కువైందని ఆయన అన్నారు.దీంతో చిన్మయి భాగ్యరాజ్ చేసిన కామెంట్స్‌పై మండిపడింది.అంతా ఆడవారే చేస్తున్నట్లు ఆయన మాట్లాడటం చాలా బాధాకరం అని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

ఇక భాగ్యరాజ్ చేసిన కామెంట్స్‌పై పలువురు మండిపడుతున్నారు.

కాగా చిన్మయి చేసిన కామెంట్‌కు మిశ్రమ స్పందన వస్తోంది.ఈ వివాదం ఇటు దారితీస్తుందో అని తమిళ సినీ జనాలు అనుకుంటున్నారు.

మరి చిన్మయి కామెంట్‌లకు భాగ్యరాజ్ మళ్లీ ఏమైనా స్పందిస్తాడో లేడో చూడాలి.

తాజా వార్తలు

Singer Chinmayi Fires On Director Bhagyaraj Comments On Women-director,kollywood News,singer Chinmayi,women Related....