లెజెండ్రీ డైరెక్టర్‌ ను టార్గెట్‌ చేసిన సమంత ఆత్మ  

singer chinmayi comments on tamil director mani ratnam,singer chinmayi , navarasa web series, singer karthik, mani ratnam web series, 9 directors - Telugu 9 Directors, Chinmayi, Mani Ratnam Web Series, Maniratnam, Navarasa, Navarasa Web Series, Singer Chinmayi, Singer Karthik, Surya, Tamil Director

తమిళ దర్శకుడు మణిరత్నంకు సౌత్‌లోనే కాకుండా ఉత్తరాదిన కూడా విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.ఈయన దర్శకత్వంలో పలు సినిమాలు హిందీలో సూపర్‌ హిట్‌ అయ్యాయి.

TeluguStop.com - Singer Chinmayi Comments On Tamil Director Mani Ratnam

అక్కడ కూడా మణిరత్నం డైరెక్ట్‌ సినిమాలు తీశాడు.సౌత్‌ లో టాప్‌ స్టార్‌ 5 మంది దర్శకుల పేర్లు చెప్పాలంటే అందులో ఖచ్చితంగా మణిరత్నం పేరు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత కొన్ని నెలలుగా మణిరత్నం నిర్మాణంలో తెరకెక్కబోతున్న నవసర అనే వెబ్‌ సిరీస్ గురించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రముఖులు 9 మంది దర్శకత్వం వహించబోతున్నారు.మొత్తం 9 ఎపిసోడ్స్‌ కు గాను 9 మంది దర్శకులు పని చేయబోతుండటంతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్‌ మరియు సంగీత దర్శకులు ఈ సినిమా కోసం పని చేయబోతున్నారు.

TeluguStop.com - లెజెండ్రీ డైరెక్టర్‌ ను టార్గెట్‌ చేసిన సమంత ఆత్మ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

20 మంది ముఖ్యమైన నటీనటులు పని చేయబోతున్న ఈ సినిమా కోసం ప్రముఖ సింగర్స్‌ సైతం పాడబోతున్నారు.మొత్తానికి ఈ వెబ్‌ సిరీస్‌ ఒక అద్బుతంగా ఉండబోతుంది.అలాంటి వెబ్‌ సిరీస్‌ పై మీటూ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది.సమంతకు డబ్బింగ్‌ చెప్పడం ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకున్న చిన్మయికి సమంత ఆత్మ అనే పేరు కూడా ఉంది.ఈమె గత కొన్నాళ్లుగా మీటూ అంటూ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది.

గాయకుడు కార్తిక్‌ పై కూడా ఈమె ఆరోపణలు చేసింది.ఆ కార్తీక్‌ ను నవరస సినిమా కోసం తీసుకోవడంతో మణిరత్నంను చిన్మయి విమర్శించింది.

మీటూ అంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి మీరు ఛాన్స్‌ ఇస్తారు.కాని బాధితులకు మాత్రం మీరు పని ఇవ్వరు అంటూ అసహనం వ్యక్తం చేసింది.

మీరు ఎటువంటి వారికి అవకాశాలు ఇస్తున్నారో ఒకసారి చూసుకోండి అంటూ మణిరత్నంను టార్గెట్‌ చేసి విమర్శలు చేసింది.

#Tamil Director #Navarasa #ManiRatnam #Maniratnam #Singer Chinmayi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Chinmayi Comments On Tamil Director Mani Ratnam Related Telugu News,Photos/Pics,Images..