సింగర్ మనోపై నోరు పారేసుకున్న చిన్మయి

సౌత్ లో స్టార్ సింగర్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మనో.సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సౌత్ ఇండియా ప్రేక్షకులు అందరికి పరిచయం ఉన్న మనో తన కామెడీ టైమింగ్, మాటలతో ఎక్కడ ఉన్న సందడి చేస్తూ సరదాగా ఉంటారు.

 Singer Chinmayi Comments On Star Singer Mano-TeluguStop.com

అలాంటి వ్యక్తి గురించి ఎవరైనా తప్పుగా ఆరోపణలు చేస్తే అందులో వాస్తవం ఉందా అనే అనుమానం కలుగుతుంది.తాజాగా మనోపై మరో సింగర్ షింగ్ కామెంట్స్ చేసింది.

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులపై గొంతు విప్పిన సింగర్ చిన్మయి ఇప్పుడు మనోపై మరో రకమైన కామెంట్స్ చేసింది

సోషల్ మీడియాలో ఎప్పుడు మహిళల హక్కుల గురించి మాట్లాడుతూ సినిమాలలో వచ్చే సన్నివేశాలు, హీరో, హీరోయిన్స్ వ్యత్యాసం మీద కూడా తెగ విమర్శలు చేస్తూ ట్రోల్స్ బారిన పడుతుంది.తాజాగా ఆమె తమిళ డబ్బింగ్ యూనియన్ ఎన్నికలలో పాల్గొంది.

అయితే ఆమె నామినేషన్ చివరి నిమషంలో తిరస్కరణకి గురైంది.దీనికి కారణం సింగర్ కార్తీక్ అంటూ ఆరోపణలు చేసింది.

అలాగే గతంలో అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసింది.

ఈ విషయంలో కార్తీక్ కి మనో మద్దతుగా నిలిచాడు.

దీంతో చిన్మయి మనోపై కూడా నోరు పారేసుకుంది.తనకు కార్తీక్ రాజీ కుదర్చడానికి మనో ప్రయత్నించారని తెలిపారు.

కార్తీక్‌, మనో మంచి సింగర్సే కావచ్చేమో కాని మంచి గొప్ప వ్యక్తులు కాదని ఆరోపించారు.వారికి అసలు వ్యక్తిత్వమే లేదని విమర్శించింది.

ఈ వ్యాఖ్యలు కోలీవుడ్ లో మరింత దుమారం రేపాయి.మరి చిన్మయి వాఖ్యలపై మనో ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube