ఆ దర్శకులు హీరోయిన్లను దారుణంగా హింసిస్తారంటున్న ప్రముఖ సింగర్...  

Singer Chinmayi Doing Sensational Comments On Directors - Telugu Chinmayi Kollywood News, Chinmayi Latest News, Chinmayi Movie News, Chinmayi New News, Chinmayi News, Singer Chinmayi Doing Comments On Directors

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ప్రముఖ సింగర్ చిన్మయి నిత్యం ఏదో ఒక వివాదం కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.ఇప్పటికే తమిళ సినిమా పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై పోరాడుతూ తమిళ్ డబ్బింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధా రవిపై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా చేసింది.

Singer Chinmayi Doing Sensational Comments On Directors - Telugu Kollywood News Latest Movie New Song

దీంతో గత కొద్దికాలంగా సింగర్ చిన్మయి కోలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురైంది.

అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంది సింగర్ చిన్మయి.

ఇందులో భాగంగా కొందరు దర్శకుల పై పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ క్రమంలో హీరోయిన్లను తమ చిత్రాల్లో నటింపజేసే సమయంలో హీరోయిన్ల బుగ్గలు వాచిపోయేలా కొడుతూ ప్రవర్తిస్తారని పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేగాక హీరోయిన్లు కూడా ఇలాంటి విషయాలను బయటకి చెప్పుకోరని ఒకవేళ ఎక్కడ ఇలాంటి విషయాలు బయటకు పొక్కితే తమ సినీ జీవితం పై ప్రభావం చూపుతాయని సర్దుకుపోతున్నారనీ కూడా అన్నారు.  గతంలో సీనియర్ నటి రేఖ బుగ్గలపై తమిళ విలక్షణ నటుడు కమల్ హాసన్ ఆమెకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టుకున్నాడని, కానీ ఆ సమయంలో రేఖ కి ఇష్టం లేకపోయినప్పటికీ కమలహాసన్ స్టార్ హీరో కావడంతో ఈ ఈ విషయంపై ఆమె నవ్వుతూనే స్పందించిందని అన్నారు.

ఇలాంటి ఘటనలు సినీ పరిశ్రమలో కోకొల్లలని, కానీ కొంతమంది మాత్రం అవకాశాల కోసం మాత్రమే ఇలాంటి భరిస్తున్నారని అంటోంది ఈ అమ్మడు.అయితే గత కొద్ది కాలంగా తమిళ సినీ పరిశ్రమలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ తెలుగులో మాత్రం అడపాదడపా డబ్బింగ్ చెబుతూ పాటలు పాడుతూ బాగానే రాణిస్తోంది సింగర్ చిన్మయి.

తాజా వార్తలు

Singer Chinmayi Doing Sensational Comments On Directors-chinmayi Latest News,chinmayi Movie News,chinmayi New News,chinmayi News,singer Chinmayi Doing Comments On Directors Related....