అతడు ఎదురైతే చెంప పగులకొడతా.. చనిపోయేందుకు సిద్దమే  

Singer Chinmayi Accuses Vairamuthu-chinmayi,chinmayi News,vairamuthu

కోలీవుడ్‌ లెజండ్రీ రచయితగా పేరున్న వైరముత్తుపై సింగర్‌ చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఆమె చేసిన ఆరోపణలతో ఆయన పరువు పోయింది. అయితే చిన్మయి అంత పచ్చిగా ఆయన్ను విమర్శించినా, ఆయనపై సంచలన ఆరోపణలు చేసినా కూడా తమిళ సినీ వర్గాల వారు మాత్రం ఆయన్ను పల్లెత్తి మాట అనడం లేదు..

అతడు ఎదురైతే చెంప పగులకొడతా.. చనిపోయేందుకు సిద్దమే-Singer Chinmayi Accuses Vairamuthu

ఎందుకంటే ఆయనపై అందరికి మంచి గౌరవం ఉండటంతో పాటు, ఆయన ఒక గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు. అంతటి వ్యక్తి ఇప్పుడు చిన్మయి విమర్శలకు సమాధానం చెప్పలేక పోతున్నాడు. ఎంతో మందితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు, పలువురు సింగర్స్‌ను గదిలోకి రమన్నాడని, ఎంతో మంది జీవితాలతో, కెరీర్‌లతో ఆడుకున్నాడు అంటూ చిన్మయి తాజాగా చెప్పుకొచ్చింది.

అందుకే ఈసారి వైరముత్తు తనకు ఎదురు అయితే మాత్రం చెంప పగుల కొడతాను అంది. ఆ క్రమంలో తన ప్రాణాలు పోయిన పర్వాలేదు అన్నట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఇటీవల కాంగ్రెస్‌ నాయకురాలు ఖుష్బు ఒక వ్యక్తి చెంప పగుల కొట్టింది.

తన వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాలని భావించిన వ్యక్తి చెంప పగుల కొట్టి వావ్‌ అనిపించుకుంది.

ఖుష్బులా అందరం ఉండాలని, అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప పగుల కొట్టినప్పుడే మరోసారి అతడు అలాంటి పనులు చేయడు అని, అందుకే తనకు వైర ముత్తు ఎదురైతే వెంటనే చెంప పగుల కొడతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈమె గత కొన్ని రోజులుగా డబ్బింగ్‌ ఆర్టిస్టు అసోషియేషన్‌ వ్యక్తి రాధా రవితో కూడా తీవ్ర స్థాయిలో యుద్దం చేస్తోంది. మొత్తానికి చిన్మయి తెలుగు మరియు తమిళ రాష్ట్రాల్లో తన సంచలన వ్యాఖ్యలతో సందడి చేస్తోంది.