తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు  

Singer Becomes Dialogue Writer, Devisri Prasad, Writer Satyamurthy, Singer Sagar, Puri Jagannadh, Fighter Movie - Telugu Devisri Prasad, Fighter Movie, Puri Jagannadh, Singer Becomes Dialogue Writer, Singer Sagar, Writer Satyamurthy

తెలుగు సినిమా పరిశ్రమలో రచయిత సత్యమూర్తి అంటే తెలియని వారు ఉండరు.సత్యమూర్తి కొడుకు అనే ట్యాగ్ తో టాలీవుడ్ లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

TeluguStop.com - Singer Becomes Dialogue Writer

తరువాత అతని ప్రస్తానం ఎలా సాగిందో అందరికి తెలిసిందే.సత్యమూర్తి కొడుకు దేవిశ్రీ ప్రసాద్ అనే స్థాయి నుంచి దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి అనే రేంజ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా చేరుకున్నారు.

టాలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ అన్న దారిలో కాకుండా గాయకుడుగా ముందు పరిచయం అయ్యాడు.

TeluguStop.com - తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అన్న చేసిన సినిమాలలో పాటలు పాడాడు.అయితే చాలా రోజులుగా సాగర్ పాటలకి దూరంగా ఉన్నాడు.

ఈ మధ్యలో మరో కొత్త అవతారంలోకి మారాడు.అదే రచయితగా.

తండ్రి వారసత్వాన్ని సాగర్ కొనసాగిస్తున్నాడు.

తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి తొలి ప్రయత్నంగా బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన `రాక్షసుడు` చిత్రానికి మాటలు అందించిన సాగర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఫైటర్ సినిమాకి మాటల రచయితగా పనిచేయబోతున్నారు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ – హిందీ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.సాగర్ ఫైటర్ చిత్రం తమిళ్ వెర్షన్ కి డైలాగ్ లు రాస్తున్నారు.

సోమవారం పూరి బర్త్ డే సందర్భంగా సాగర్ విష్ చేస్తే పూరి జగన్నాథ్ అసలు విషయాన్ని బయట పెట్టారు.మనమిద్దరం ఫైటర్ కోసం కలిసి పనిచేస్తుండటం సంతోషంగా వుంది.

నీ రైటింగ్ స్కిల్స్ తో మీ నాన్నని గర్వపడేలా చేస్తావ్ అని పూరి అసలు విషయం బయటపెట్టారు.మొత్తానికి దేవిశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే తండ్రి వారసత్వం తీసుకొని సాగర్ రచయితగా అడుగులు వేస్తున్నాడు.

ఈ అడుగులు ఎంత వరకు సక్సెస్ అవుతాయో అనేది చూడాలి.

#Singer Sagar #SingerBecomes #Devisri Prasad #Puri Jagannadh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Singer Becomes Dialogue Writer Related Telugu News,Photos/Pics,Images..