సంబంధాల బలోపేతమే లక్ష్యం.. భారత పర్యటనకు సింగపూర్ ఉప ప్రధాని, ఐదు రోజులు ఇక్కడే

సింగపూర్ ఉపప్రధాని లారెన్స్ వాంగ్ ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శనివారం భారత్‌కు చేరుకున్నారు.ఇరుదేశాల మధ్య ఇప్పటికే వున్న సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంతో పాటు అభివృద్ధి చెందుతోన్న రంగాల్లో పరస్పర ప్రయోజనకరమైన అవకాశాలను గుర్తిస్తామని సింగపూర్ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 Singapore’s Deputy Pm Lawrence Wong Arrives In India For 5-day Official Visit-TeluguStop.com

సింగపూర్ ఉప ప్రధాని హోదాలో వాంగ్ భారతదేశానికి రావడం ఇదే తొలిసారి.శనివారం న్యూఢిల్లీలో జరిగిన భారత్ సింగపూర్ మినిస్టీరియల్ రౌండ్ టేబుల్ (ఐఎస్ఎంఆర్)లో ఆయన పాల్గొన్నారు.

ఐఎస్ఎంఆర్ అనేది ఇరు దేశాల మధ్య కొత్త మంత్రిత్వ వేదిక.

స్వయంగా ఆర్ధిక మంత్రి కూడా అయిన వాంగ్.

సింగపూర్ విదేశాంగ శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్, వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి గాన్ కిమ్ యోంగ్, రవాణా వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్ మంత్రి ఎస్ ఈశ్వరన్‌తో కలిసి ఐఎస్ఎంఆర్‌కు హాజరయ్యారు.దీనితో పాటు భారత సీనియర్ నేతలు, ప్రముఖులను కూడా వాంగ్ కలుస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

ఆదివారం గుజరాత్‌లో పర్యటించనున్న వాంగ్.ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్‌తో సమావేశమై గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిటీని సందర్శిస్తారు.

ఆయన వెంట విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు వుంటారని ఛానెల్ న్యూస్ ఏషియా నివేదించింది.

Telugu Externalaffairs, Singaporedeputy, Deputypm-Telugu NRI

ప్రస్తుతం అస్థిరంగా వున్న ఆర్ధిక పరిస్ధితుల మధ్య సింగపూర్ పురోగమించడానికి భారత్, చైనాలు దానికి ఎంతో ముఖ్యం.ఇప్పటికే ప్రపంచ మార్కెట్లలో ఒడిదుడుకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే.రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, చైనా- తైవాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సింగపూర్ చూపు భారత్, చైనాల మీద పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube