మే 20 నాటికి భారత్ లో కరోనా వైరస్ అంతం... సింగపూర్ వర్సిటీ పరిశోధన

కరోనా వైరస్ మహమ్మరిలా మారి ప్రపంచ దేశాలని వణికిస్తుంది.అయితే ఈ వైరస్ సహజ సిద్ధంగా పుట్టింది అని చైనా చెబుతూ ఉంటే, ఇది ముమ్మాటికి చైనా ప్రభుత్వం వూహాన్ ల్యాబ్ లో రూపొందించిన వైరస్.

 Singapore University Says Corona Ending On May 20 In India, Corona Effect, Lock-TeluguStop.com

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీయడానికి చైనా ప్రయోగించిన బయో వెపన్ ఇది అని చాలా మంది గట్టిగా నమ్ముతున్నారు.అయితే వీటిని చైనా ఖండిస్తున్న కూడా ప్రపంచ దేశాలు మాత్రం నమ్మడం లేదు.

అలా అని ఆధారాలు లేకుండా బలంగా వేలెత్తి చూపించలేని పరిస్థితి.ఇదిలా ఉంటే ఈ కరోనా వైరస్ కి వాక్సిన్స్ ని సిద్ధం చేసే పనిలో అన్ని దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి.

మరో వైపు ఈ వైరస్ ప్రభావం ఆయా దేశాలలో ఎంత కాలం ఉంటుంది అనే విషయాలు తెలుసుకుంటున్నారు.

ప్రపంచంలో చాలా దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా వ్యాప్తి కొంత నియంత్రణలోనే ఉంది.

లాక్ డౌన్ కారణంగా కేసుల సంఖ్య వందలలో ఉంది.ఇక మే 20 నాటికల్లా భారత్ లో కరోనా వైరస్ అంతం అవుతుందని సింగపూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు చెబుతున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సేకరించిన డేటాను విశ్లేషించిన అనంతరం సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ ఈ ప్రకటన చేసింది.భారతదేశంతో పాటు వివిధ దేశాలలో కరోనా వైరస్ త్వరలో అంతం కానుందని ఎస్‌యుటిడి తెలిపింది.

ఎస్‌యుటీడీ ఈ అంచనాను సస్సెప్టబుల్ ఇన్ఫెక్టెడ్ రికవర్డ్ అంటువ్యాధి నమూనాను విశ్లేషించింది.వివిధ దేశాలలోని కరోనా అనుమానిత, సోకిన, కోలుకుంటున్న రోగుల నమూనాలను విశ్లేషించింది.

వివిధ దేశాలలో ఈ మహమ్మారి విస్తరించిన తేదీలను కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ విషయాన్ని దృవీకరిస్తూ ప్రకటన చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube