ఫలించిన చర్చలు...భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన సింగపూర్...!!!

కరోనా సమయంలో దాదాపు అన్ని దేశాలు భారత్ పై ఆంక్షలు విధించిన విషయం అందరికి తెలిసిందే.అయితే భారత్ పై మాత్రం సుదీర్ఘంగా ఆంక్షలు విధించడంతో భారత్ నుంచీ విదేశాలు వెళ్ళే వలస వాసులు, ఎన్నారైలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.

 Singapore Tells Good News To Indians , India, Corona Vaccine, Singapore, Governm-TeluguStop.com

అటు ఉపాది కోల్పోయి, ఇటు పని లేక ఇబ్బందులు పడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.అయితే కరోనా కేసులు తగ్గుముఖం పడటంతో పలు దేశాలు ఇప్పుడిప్పుడే భారతీయులకు ఆహ్వానాలు అందిస్తున్నాయి.

కానీ ఇప్పటికి ఎన్నో ఆంక్షలు విధిస్తూ అనుమతులు ఇవ్వడంపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా పలు దేశాలు ఇప్పటికి తమ దేశం విధించిన నిభందనలు పాటించాలని చెప్పడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఈ నేపధ్యంలోనే భారత ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన సింగపూర్ తో భారత ప్రభుత్వం గత కొంత కాలంగా చర్చలు జరిపింది.సింగపూర్ లో కి భారత్ నుంచీ వచ్చే ప్రయాణీకులు అడుగు పెట్టాలంటే తప్పకుండా వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటుగా, పాజిటివ్ రిపోర్ట్, కూడా ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాదు ఇవన్నీ ఉన్నా సరే సింగపూర్ లోకి వచ్చిన తరువాత తప్పకుండా క్వారంటైన్ లో ఉండాలి షరతులు పెట్టింది.

దాంతో భారత ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఎన్నారైలు వినతులు ఇవ్వడంతో గత కొంత కాలంగా సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన భారత్ ఎట్టకేలకు భారతీయులకు గుడ్ న్యూస్ తీసుకువచ్చింది.ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వ్యక్సినేటడ్ లేన్ ట్రావెల్ ప్రోగ్రామ్ జాబితాలో భారత్ ను కూడా చేర్చింది.ఈ లిస్టు లో భారత్ ను చేర్చడం వలన ఇకపై వ్యాక్సిన్ చేయించుకున్న భారతీయులు ఎవరైనా సరే సింగపూర్ లో క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

అంతేకాదు సింగపూర్ నుంచీ భారత్ కు విమానాలు నడిపే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయని త్వరలో ఈ అవకాశం కూడా అందుబాటులోకి వస్తుందని ఆదేశ విదేశాంగ శాఖామంత్రి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube