సింగపూర్ లో భారత సంతతి వ్యక్తి అరెస్ట్..ఎందుకంటే

భారత ప్రభుత్వ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విదేశాలలో ఉన్న కొంతమంది భారతీయులు నిరసనలు తెలుపుతున్న విషయం విధితమే.ఈ నిరసనల గళం వినిపించిన వారిని ఆయా దేశాల పోలీసులు అరెస్ట్ లు చేసి ఊచలు లేక్కపేట్టిస్తున్నారు.

 Singapore Police Probing Indian Man-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఈ విధంగా దుబాయి, అమెరికా, వంటి పలు దేశాలలో వరుసగా భారతీయుల అరెస్ట్ లు జరిగాయి.తాజాగా ఇదే విషయంపై సింగపూర్ ఓ భారతీయుడు అరెస్ట్ అయ్యారు వివరాలోకి వెళ్తే

సీఏఏ కి వ్యతిరేకంగా సింగపూర్ లో నిరసనలు తెలిపిన ఓ భారత సంతతి వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

అక్కడి పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.మెరీనా బె సాండ్స్ హోటల్ సమీపంలో ఫ్లకార్డ్ పట్టుకుని నిరసన తెలిపిన అతడు ఆ సమయంలో తీసిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అవి కాస్తా వైరల్ అవ్వడంతో కొంత సేపటికే వాటిని తీసేశాడు.

సింగపూర్ లో భారత సంతతి వ్యక్త

అయితే ఈ తతంగాన్ని ముందు నుంచీ గమనిస్తున్న పోలీసులు అతడు పోస్ట్ డెలీట్ చేయగానే అతడిని అరెస్ట్ చేశారు.అసలు అతడు ఎందుకు పోస్ట్ పెట్టాడు అనే కోణంలో విచారణ చేపట్టారు.ఇదిలాఉంటే సింగపూర్ చట్టాల ప్రకారం వేరే దేశ రాజకీయాలకి సంభందించి అక్కడ నిరసనలు చేయడం గాని, సభలు ఏర్పాటు చేయడం కాని సింగపూర్ చట్టాల ప్రకారం నేరం కాబట్టి అందుకే అతడిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు.

తమ దేశానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే తమ చట్టాలని గౌరవించాల్సిందేనని లేకపోతే ఖటినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube