సింగపూర్: మృత్యువుతో పోరాటం.. భారత్‌లోని పిల్లలను చూడాలన్న కోరికను తీర్చిన వైద్యులు

క్యాన్సర్ బారినపడిన ఒక భారత సంతతి మహిళ.ఇండియాలో వున్న తన ఇద్దరు పిల్లలను కలుసుకోవాలనే కోరికను సింగపూర్ వైద్య బృందం నెరవేర్చింది.

 Singapore Medical Team Fulfils Cancer-stricken Woman's Dying Wish To Meet Her Ch-TeluguStop.com

కోవిడ్ తీవ్రత అధికంగా వున్నప్పటికీ సింగపూర్ నుంచి నేరుగా తమిళనాడులోని తిరుచిరాపల్లికి ఆమె ప్రయాణం ఏర్పాటు చేసినట్లు సింగపూర్ మీడియా కథనాలు ప్రచురించింది.

వివరాల్లోకి వెళితే.

రామమూర్తి రాజేశ్వరి అనే భారత సంతతి మహిళ సింగపూర్‌లో శాశ్వత నివాసి.ఆమె గొంతు క్యాన్సర్‌తో గత కొంతకాలంగా బాధపడుతోంది.

దీంతో 12, తొమ్మిదేళ్ల వయసున్న తన ఇద్దరు పిల్లలను 2019 జనవరిలో తమిళనాడులోని తమ స్వగ్రామం తిరుచ్చిరాపల్లి సమీపంలోని ఇంటికి పంపించి వారి బంధువుల సంరక్షణలో వుంచింది.ఈ క్రమంలో రాజేశ్వరికి క్యాన్సర్ బాగా ముదిరిపోయినట్లు ఆమె భర్త రాజగోపాలన్ కొలంచిమణి న్యూస్ ఆసియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

అయితే జూన్ 27, 2020న భార్యాభర్తలు భారతదేశానికి వచ్చిన రెండు వారాల తర్వాత రాజేశ్వరి (44)కన్నుమూశారు.

అయితే తన ఆరోగ్యం విషమిస్తున్నట్లు గుర్తించిన రాజేశ్వరి .తన పిల్లలను చూడాలనిపిస్తోందని భర్తను కోరింది.దీంతో ఒక యాప్ సాయంతో పిల్లలను చూసిందని రాజగోపాలన్ చెప్పారు.

ఆరోగ్యం విషమించడంతో రాజేశ్వరిని ఆసుపత్రికి తరలించారు.ఆ స్థితిలోనే ఆమె తన పిల్లలను చూడాలనిపిస్తోందని చెప్పింది.

ఆమె బాధను అర్థం చేసుకున్న టాన్ టాక్ సెంగ్ ఆసుపత్రి (టీటీఎస్‌హెచ్) వైద్య బృందం .విమానంలో ఆసియా పసిఫిక్ పాలియేటివ్ కేర్ నెట్‌వర్క్ ద్వారా ఒక బృందాన్ని రాజేశ్వరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసింది.

అంతా బాగానే వుంది కానీ ఆ సమయంలో సింగపూర్‌తో పాటు భారత్‌లోనూ కోవిడ్ తీవ్రత అధికంగా వుండటంతో పాటు తన భార్య ఆరోగ్యం కూడా విషమంగా వుందని.దీంతో రాజేశ్వరిని తిరుచ్చికి తీసుకెళ్లగలనా లేదా అన్న అనుమానం కలిగిందని రాజగోపాల్ గుర్తుచేసుకున్నారు.

అయితే రాజేశ్వరిని తిరుచ్చికి తీసుకెళ్లడానికి వీలుగా ఆసుపత్రి వైద్య బృందం ఆమెను డిశ్చార్జ్ చేసింది.అయితే ఒక్కసారిగా ఆమె స్పృహ కోల్పోవడంతో.తాను నాడి పట్టుకుని చూడగా పల్స్ పడిపోయిందని గుర్తించినట్లు ఆయన తెలిపారు.దీంతో వైద్యులకు విషయం చెప్పినట్లు రాజగోపాలన్ వెల్లడించారు.

రాజేశ్వరి పరిస్ధితిని చూసిన వైద్యులకు ఆమె అంతిమ సమయం ఆసన్నమైందని గుర్తించారు.తీవ్రంగా రక్తస్రావం కావడంతో పాటు ఆక్సిజన్ లెవ్స్ కూడా పడిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

ఆ స్ధితిలో కూడా ఫోన్‌ ద్వారా భారత్‌లో వున్న పిల్లలను, ఫ్యామిలీ ఫోటోలను చూస్తోందని మెడికల్ టీమ్‌లోని అసోసియేట్ కన్సల్టెంట్ డాక్టర్ యుంగ్ అన్నారు.గొంతు క్యాన్సర్ కావడంతో రాజేశ్వరి మాట్లాడే శక్తి కోల్పోయారు.

కానీ ఇండియాకు వెళ్లడం తన చివరి కోరిక అని చెప్పడంతో డాక్టర్లు శక్తివంచన లేకుండా ప్రయత్నించారు.

ఇక కోవిడ్ కారణంగా ఇరు దేశాల మధ్య రాకపోకలు నిలిచిపోవడంతో ఎయిరిండియా, సింగపూర్ సివిల్ ఏవియేషన్ అథారిటీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాయంతో రాజేశ్వరి విమాన ప్రయాణానికి అనుమతి లభించింది.

అలాగే రాజేశ్వరి వెంట వున్న వారికి, భర్తకు, ఆమె సోదరికి విమానంలో అత్యవసర పరిస్ధితి తలెత్తితే ఏం చేయాలో శిక్షణ నిచ్చారు.అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే విమానం పూర్తిగా నిండిపోవడంతో.

ఇతర ప్రయాణీకులు రాజేశ్వరి, ఆమె భర్త, సోదరి కోసం తమ సీట్లను వదులుకున్నారు.అందరి సహాయ సహకారాలతో రాజేశ్వరి క్షేమంగా భారత గడ్డపైకి అడుగుపెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube