Singapore court : డ్రగ్స్ కేసులో ఉరి.. ఆఖరి ప్రయత్నం విఫలం, ముగ్గురు భారత సంతతి వ్యక్తుల పిటిషన్ కొట్టేసిన కోర్ట్

డ్రగ్స్ కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు కోర్టులో నిరాశే ఎదురైంది.ఉరిశిక్షను రద్దు చేయాల్సిందిగా కోరుతూ ఈ ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌ను సింగపూర్ హైకోర్ట్ కొట్టివేసింది.

 Singapore Court Dismisses 3 Indian-origin Malaysians Plea Against Execution In D-TeluguStop.com

వీరితో పాటు మరో సింగపూర్ మలేషియా సంతతి వ్యక్తికి కూడా న్యాయస్థానంలో నిరాశ ఎదురైంది.ఈ నలుగురిని సింగపూర్‌కు చెందిన జుమాత్ మొహమ్మద్, భారత సంతతికి చెందిన మలేషియన్లు లింగేశ్వర్ రాజేంద్రన్, దచ్చినమూర్తి కటయ్య, సామినాథన్ సెల్వరాజులుగా గుర్తించారు.

స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదిక ప్రకారం.ఈ నలుగురు దోషులకు 2015 నుంచి 2018 మధ్యకాలంలో న్యాయస్థానం మరణశిక్ష విధించింది.

ఇదే సమయంలో ఉరిశిక్షకు వ్యతిరేకంగా 2016 నుంచి 2020 మధ్య వీరు న్యాయపోరాటం చేయగా, వీరి అప్పీల్‌ను కోర్టులు పలుమార్లు కొట్టివేశాయి.

డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో దచ్చినామూర్తిని ఏప్రిల్ 2015న దోషిగా నిర్ధారించిన కోర్టు మరణశిక్షను విధించింది.

ఈ తీర్పును సవాల్ చేస్తూ అతను దాఖలు చేసిన అప్పీల్‌ను ఫిబ్రవరి 2016లో తోసిపుచ్చింది.అయితే జనవరి 2020లో దచ్చినామూర్తి, అతని తోటి ఖైదీ గోబీ అవెడియన్‌లు ఉరిశిక్ష నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు.అదే ఏడాది ఏప్రిల్‌లో తమ ప్రైవేట్ లేఖలను అక్రమంగా కాపీ చేసి జైలు ద్వారా పంపుతున్నారని దచ్చినామూర్తి, గోబీలు అటార్నీ జనరల్ ఛాంబర్స్ (ఏజీసీ)పై ఫిర్యాదు చేశారు.2020 ఆగస్టులో దీనిపై విచారణ జరిపిన అప్పీల్ కోర్ట్.వీరిద్దరి కేసును కొట్టివేసింది.అయితే ఖైదీల సమ్మతి, కోర్ట్ అనుమతి లేకుండా వారి ప్రైవేట్ పత్రాల కాపీలను ఏజీసీకి ఫార్వార్డ్ చేయడానికి జైలు అధికారులకు అధికారం లేదని కోర్టు తీర్పు వెలువరించింది.2021 జూలైలో దచ్చినామూర్తి ఇతర 21 మంది ఖైదీలు తమ ప్రైవేట్ లేఖలను ఏజీసీకి ఫార్వార్డ్ చేయడంపై మరోసారి కోర్టును ఆశ్రయించారు.

Telugu Indianorigin, Drug, Nagendran, Singapore-Telugu NRI

ఇకపోతే.మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన నాగేంద్రన్ కె.ధర్మలింగంను ఈ ఏడాది ఏప్రిల్ 27న సింగపూర్ ప్రభుత్వం ఉరితీసిన సంగతి తెలిసిందే.తన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని అతను 11 ఏళ్లుగా చేసిన న్యాయపోరాటం ఫలించలేదు.సామాజిక కార్యకర్తలు సహా అంతర్జాతీయ సమాజం తీవ్ర ఒత్తిడి తెచ్చినా సింగపూర్ కనికరించలేదు.

మానసిక అంగవైకల్యంతో బాధపడుతున్న తన కుమారుడికి క్షమాభిక్ష పెట్టాలని నాగేంద్రన్ తల్లి విలపించినా న్యాయస్థానం పట్టించుకోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube