సింగపూర్ వేదికగా....కరోనా పై ఆయుర్వేద సలహాలకై తెలుగు వారి “వీధి అరుగు”

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నాయో అందరకి తెలిసిందే.ముఖ్యంగా దేశం కాని దేశంలో ఉంటూ భారతీయులు పడిన ఆందోళన అంతాఇంతా కాదు.

 Singapore As A Venue  Telugu street Arugu For Ayurvedic Advice On Corona, Telugu-TeluguStop.com

కొందరు భారత్ కు వచ్చేయగా మరి కొందరు విదేశాలలోనే ఉండిపోయారు.అయితే విదేశాలలో ఉన్న ప్రవాస భారత సంస్థలు అక్కడి భారతీయులకు తమకు తోచిన సాయం అందించాయి.

ముఖ్యంగా తెలుగు సంఘాలు ప్రవాసాంధ్రుల రక్షణకై చేపట్టిన చర్యలు ఎంతో మంది తెలుగు ఎన్నారైలలో ధైర్యాన్ని నింపాయి.తరచుగా వైద్యులతో, మానసిక వైద్య నిపునలతో వర్చువల్ గా ఏర్పాటు చేసిన సమావేశాలు ఎంతో మంది తెలుగు ప్రవాసులకు మనో ధైర్యాన్ని ఇచ్చాయి.

అయితే కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరికి మహమ్మారి పై అవగాహన తప్పనిసరి కావడంతో సింగపూర్ లో ఉంటున్న తెలుగు ఎన్నారైల కోసం సింగపూర్ లో స్థాపించబడిన స్వచ్చంద సంస్థ వీధి అరుగు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసింది.ఈ వీధి అరుగు సంస్థ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.

ప్రస్తుతం కరోనా ముంచుకొస్తున్న తరుణంలో ఆయుర్వేదం తో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, దైనందిక జీవితం లో ఆయుర్వేదం ఎలా ఉపయోగపడుతుంది.మనిషి జీవితంలో ఆయుర్వేద పాత్ర ఏమిటి అనే విషయాలపై అవగాహన కల్పించనుంది.

Telugu Corona Wave, Drcreature, Koduruishwara, Singapore, Singaporetelugu, Veedh

వీధి అరుగు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తమ అనుభవాలు పంచుకోవడానికి , సూచనలు ఇవ్వడానికి శాంతా బయోటెక్ వ్యవస్థాపకులు కోడూరు ఈశ్వర ప్రసాద్ అలాగే ఆయనతో పాటు ప్రముఖ ప్రఖ్యాత ఆయుర్వేద వైద్య నిపుణులు డా.జీవీ.పూర్ణ చంద్ పాల్గొననున్నారు.జులై 25 తేదీన నిర్వహించనున్నారు.సోషల్ మీడియా వేదికగా ఏర్పాటు చేయనున్న ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అనుకునే వారు తాము ఇచ్చిన లిక్ లో అప్ప్లికేష్ పూర్తి చేసి , తమ అభిప్రాయాలు అందులో తెలియజేయాలని కోరారు.

లింక్ : -https://docs.google.com/forms/d/e/1FAIpQLSeN09_4YgQUyyBTymcV0q0yKxKDEUoScZjJXxylb3QlsYlngw/viewform

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube