సింధు విజయం యువతకు స్ఫూర్తి.. డీజీపీ గౌతమ్ సవాంగ్..

సింధు విజయం యువతకు స్ఫూర్తి.డీజీపీ గౌతమ్ సవాంగ్.

 Sindhu Victory Inspires Youth Dgp Gautam Sawang , Dgp Gautam Sawang, Pv Sindh-TeluguStop.com

ఒలింపిక్స్లో కాంస్య పతకాన్ని సాధించిన షట్లర్ పీవీ సింధు విజయం మహిళలకు యువతకు స్ఫూర్తినిస్తుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.శుక్రవారం పి.వి.సింధు తన తల్లిదండ్రులతో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.టోక్యో ఒలింపిక్స్ లో సాధించిన కాంస్య పతకాన్ని సింధు డిజిపి కి చూపించారు.ఈ సందర్భంగా బీజేపీ మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పీవీ సింధు పతకాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ కు అరుదైన గౌరవాన్ని సాధించారని కొనియాడారు.

త్రిశక్తి లో మరిన్ని పతకాలు సాధించి రాష్ట్రానికి కీర్తి ప్రతిష్ఠలు తేవాలని డిజిపి ఆకాంక్షించారు.అనంతరం పీవీ సింధు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ మహిళల కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు రాష్ట్రంలోని మహిళలు యువకులు తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పివి సింధు తో పాటు ఆమె తల్లిదండ్రులను డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర పోలీసు అధికారులు శాలువాలతో సత్కరించారు.ఒలింపిక్స్లో మంచి ప్రదర్శన కనబరిచిన పివి సింధు రజిని సాయిరాజ్ లు శుక్రవారం ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా విశ్వభూషణ్ సింధూర సాయి రాజులను ఘనంగా సన్మానించారు.టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధు ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన మహిళగా రికార్డు సాధించింది.

ఇక భారత మహిళా హాకీ జట్టులో రజిని గోల్కీపర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.టోక్యో ఒలింపిక్స్ లో మహిళల జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన భారత్ మహిళా జట్టు 41 ఏళ్ల తర్వాత ప్రవేశించి చరిత్ర సృష్టించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube