చంద్రముఖి సీక్వెల్ లో నటించడం లేదు… సీనియర్ హీరోయిన్ క్లారిటీ  

Simran Not Acted In Chandramukhi Sequel - Telugu Director P Vasu, Kollywood, Lawrence,, Tollywood

రజినీకాంత్ హీరోగా జ్యోతిక ప్రధాన పాత్రలో వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.తమిళ, తెలుగు భాషలలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 Simran Not Acted In Chandramukhi Sequel

ఇందులో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది.దీనికి మాతృక మలయాళీ సినిమా అందులో శోభన ప్రధాన పాత్రలో నటించింది.

పి వాసు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొత్త ఒరవడి సృష్టించింది.దీనికి సీక్వెల్ గా పి వాసు తెలుగులో వెంకటేష్ హీరోగా సినిమా తీసాడు.

చంద్రముఖి సీక్వెల్ లో నటించడం లేదు… సీనియర్ హీరోయిన్ క్లారిటీ-Movie-Telugu Tollywood Photo Image

అయితే అది డిజాస్టర్ అయ్యింది.

ఇక మళ్ళీ తమిళంలో చంద్రముఖి సీక్వెల్ ప్లాన్ జరుగుతుంది.

ఇందులో రజినీకాంత్ పోషించిన డాక్టర్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నాడు.ఇక ఇందులో చంద్రముఖి పాత్ర కోసం సిమ్రాన్ ని తీసుకున్నట్లు టాక్ వినిపించింది.

అయితే ఈ విషయం మీద తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది.చంద్రముఖి సీక్వెల్ లో తాను నటించడం లేదని, దీనికోసం తనని ఎవరు సంప్రదించలేదని తేల్చేసింది.

గతంలో జ్యోతిక కూడా చంద్రముఖి సినిమా కోసం తనని ఎవరు సంప్రదించలేదని చెప్పేసింది.మరి వీరిద్దరు కాకుండా చంద్రముఖి పాత్ర కోసం ఈ సారి దర్శకుడు వాసు ఎవరిని తీసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test