దంతాలు తెల్లగా మెరవాలంటే సహజమైన ఇంటి చిట్కాలు  

simple ways to naturally whiten your teeth at home -

దంతాలు పసుపుపచ్చగా మారాయని బాధపడవలసిన అవసరం లేదు.ఎందుకంటే మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.

దంతాలు పాలిపోవటం అనేది వృద్ధాప్య ప్రక్రియలో ఒక బాగం.అయితే దంతాల మీద మరకలు,పాలిపోవటం వంటి సమస్యలకు సులభమైన ఇంటి పరిష్కారాలు ఉన్నాయి.వంద డాలర్ల బ్లీచింగ్ ట్రేలు, దంతవైద్యుడి దగ్గరకు వెళ్ళటం మరియు తెలియని రసాయన సొల్యూషన్స్ వంటివి వాడకుండా కేవలం ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు.

TeluguStop.com - దంతాలు తెల్లగా మెరవాలంటే సహజమైన ఇంటి చిట్కాలు-Telugu Health-Telugu Tollywood Photo Image

1.స్ట్రాబెర్రీలు తినాలి


స్ట్రాబెర్రీలలో మాలిక్ ఆమ్లం అనే ఎంజైము మరియు విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన దంతాలు తెల్లగా మారటానికి సహాయపడుతుంది.స్ట్రాబెర్రీలలో కనిపించే ఆస్ట్రిజెంట్ దంతాల ఉపరితల మరకలను తొలగించడానికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీ పేస్ట్ ని ఉపయోగించి వారంలో ఒకసారి లేదా రెండుసార్లు దంతాలను తోముకుంటే మంచి పలితాలు కనపడతాయి.ఒకవేళ స్ట్రాబెర్రీలను తింటే కనుక బాగా నమిలి తినాలి.

2.పళ్ళ మధ్య దారంతో శుభ్రం చేయుట (ప్లాసింగ్ )


కొంత మందికి దంతాలను తోముకున్న పళ్ళ మధ్య మరకలు అలానే ఉండిపోతాయి.

అయితే కొంత మంది దంత వైద్యులు బ్రషింగ్ కన్నా ఫ్లాసింగ్ ముఖ్యమని అంటున్నారు.మంచి పలితాలను పొందటానికి ప్రతి రోజు రెండు సార్లు ప్లాసింగ్ చేయాలి.ఈ విధంగా చేయుట వలన పళ్ళ మధ్య మరకలు పోయి తెల్లగా మెరుస్తాయి.

3.బేకింగ్ సోడా మరియు నిమ్మకాయ


ఇది దంతాలను తెల్లగా చేయటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.నిమ్మరసం,బేకింగ్ సోడా యొక్క రసాయన చర్య కారణంగా దంతాలు తెల్లగా మెరుస్తాయి.ఈ రెండు కలవటం వలన చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఈ ద్రావణాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.

చిగుళ్ళకు చికాకుగా ఉంటే మాత్రం బేకింగ్ సోడా వాడకాన్ని ఆపేయాలి.అంతేకాక ఎనామిల్ కి హాని కలుగుతుందని భయం ఉంటే ఇతర పరిష్కారాల కోసం చూడాలి.

ఒక బౌల్ లో తాజా నిమ్మరసం తీసుకోని దానిలో కొంచెం బేకింగ్ సోడా కలపాలి.ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని పళ్లకు రాయటానికి ముందు పళ్ళ మీద ఉన్న లాలాజలంను కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పళ్ళ మీద రాసి ఒక నిమిషం అయ్యాక నిదానంగా బ్రష్ చేయాలి.

ఈ మిశ్రమాన్ని దంతాల మీద ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయం ఉంచకూడదు.ఒకవేళ ఉంటే కనుక ఎనామిల్ దెబ్బతింటుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Simple Ways To Naturally Whiten Your Teeth At Home Related Telugu News,Photos/Pics,Images..