జుట్టు మెరుస్తూ కాంతివంతంగా మారాలంటే...అద్భుతమైన పాక్స్

జుట్టు అందంగా,పొడవుగా,మెరుస్తూ ఉండాలని అందరూ కోరుకుంటారు.అయితే జుట్టుకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జిడ్డు డల్ గా పొడిగా మారుతుంది.

 Simple Ways To Make Hair Silky-TeluguStop.com

అలాంటి పరిస్థితి రాకుండా జుట్టు కాంతివంతంగా మారాలంటే ఈ పాక్స్ ట్రై చేయండి.

కొబ్బరి పాలు మరియు రోజ్ మేరీ


ఒక కప్పు కొబ్బరి పాలలో మూడు స్పూన్ల రోజ్ మేరీ, ఒక క్యాప్సిల్ విటమిన్ E ఆయిల్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని గోరువెచ్చగా వేడి చేసి తలకు రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.షవర్ క్యాప్ పెట్టుకొని పడుకొని,మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు మృదువుగా కాంతివంతంగా మారుతుంది.కొబ్బరి పాలలో ఉండే మాయిశ్చరైజర్ లక్షణాలు జుట్టును బలంగా మార్చటమే కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఆముదం మరియు ఆలివ్ ఆయిల్


ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ రెండింటిని సమాన భాగాలుగా తీసుకోని బాగా కలపాలి.రాత్రి పడుకొనే ముందు తలకు రాసి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేస్తే జుట్టు సిల్కీ గా ఉంటుంది.

మెంతులు మరియు కొబ్బరి నూనె


కొబ్బరి నూనెలో మెంతులను వేసి మరిగించాలి.కాస్త గోరువెచ్చగా అయ్యాక ఆ నూనెను తలకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానము చేయాలి.మెంతులు జుట్టును బలంగా మరియు జుట్టు రాలకుండా సహాయపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు