మొబైల్ డేటా ఎక్కువ ఖర్చు కాకూడదు అంటే ఏం చేయాలి?  

Simple Tips To Reduce Your Mobile Data Usage-

Wifi అందుబాటులో ఉంటే ఫర్వాలేదు కాని, మొబైల్ డేటాతో స్మార్ట్ ఫోన్ ఉపయోగించాలంటే కష్టమైన విషయమే.మనం వాడేది కొంత, ఆప్స్ లాక్కునేది కొండంత.బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని ఆప్స్, సింకింగ్ ద్వారా కొన్ని ఆప్స్, అప్డేట్స్ వలన మరికొన్ని ఆప్స్ మీ డేటా అంతా తినేస్తుంటాయి..

Simple Tips To Reduce Your Mobile Data Usage---

అలా కాకుండా మీ డేటా తక్కువ ఖర్చు కావాలంటే దానికోసం స్పెషల్ గా మరో ఆప్ డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు.కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరి.* మొబైల్ డేటా మీదే ఆధారపడేవారైతే “లైట్” వెర్షన్ బ్రౌజర్లు వాడండి.ఇవి ఎక్కువ డేటా తోసుకోవు.

అలాగే పిసి వెర్షన్ వ్యూ ఆన్ లో ఉంటే ఆఫ్ చేయండి.* ఫేస్ బుక్ అప్లికేషన్ డేటా పెద్ద మొత్తంలో తీసుకుంటుంది.కాబట్టి ఫేస్ బుక్ ఆప్ కి బదులు, Tinfoil for Facebook వాడండి.

* సెట్టింగ్స్ లో అప్డేట్ ఆప్స్ ఆన్ వైఫై ఒన్లీ సెట్ చేసుకోండి.పొరపాటులో మొబైల్ డేటాపై కూడా అప్డేట్స్ ఆన్ లో ఉంటే మీ డేటా మొత్తం అప్డేట్స్ తినేస్తాయి.* కొన్ని అప్లికేషన్స్ కి సంబంధించి ఇన్ ఆప్ సెట్టింగ్స్ మార్చుకోండి.

ఊదాహారణకి గూగుల్ ఫోటోస్.వైఫై ఉంటే ఇబ్బంది లేదు కాని, మీ ఫోటోలను ఎప్పటికప్పుడు సింక్ చేసుకుంటూ డేటా ఖర్చుచేస్తుంది ఈ ఆప్.* బయటికి వెళ్తే కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ వాడాల్సిన పరిస్థితి ఎదురవొచ్చు.

అలాంటప్పుడు డేటా ఖర్చు చేసే బదులు, వైఫై దొరికినప్పుడు మీకు కావాల్సిన పట్టణం మ్యాప్ ని ఆఫ్ లైన్ మోడ్ లోకి డౌన్లోడ్ చేసుకోండి.* అవసరం లేని పుష్డ్ నోటిఫికేషన్స్ ని ఆఫ్ లో పెట్టండి.* వాట్సాప్ లాంటి అప్లికేషన్ లో ఆటో మీడియా డౌన్లోడ్ ని ఆఫ్ లో పెట్టండి.

కుదిరితే బ్రౌజర్స్ లో లోడ్ ఇమేజ్ కూడా ఆఫ్ చేయండి.* చాలారకాల ఆప్స్ డేటా సింక్ చేసుకుంటూ ఉంటాయి.కాబట్టి అవసరం లేని ఆప్ సింక్ ని ఆపేయ్యండి.

* డేటా ఎక్కువగా తీసుకుంటున్న బ్యాక్ గ్రౌండ్ ఆప్స్ ఎంటో గమనించండి.అవసరం లేని అప్లికేషన్స్ ని స్టాప్ చేసేయ్యండి.