మోచేతుల నలుపు.ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.చర్మం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.మోచేతల దగ్గర మాత్రం నల్లగా, రఫ్‌గా ఉంటుంది.ఇది సాధారణ సమస్య అయినప్పటికీ.కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ఇక ఈ నలుపును తగ్గించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.ఫలితం లేక బాధపడుతుంటారు.
అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈజీగా మోచేతల నలుపును తగ్గించుకోవచ్చు.
ముందుగా ఒక నిమ్మపండు తీసుకుని సగానికి కట్ చేసుకోవాలి.
కట్ చేసిన నిమ్మ ముక్కను ఉప్పులో అద్ది.మోచేతులకు రెండు నిమిషాల పాలు రుద్దాలి.
అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేయడం వల్ల మోచేతుల నలుపు క్రమంగా తగ్గిపోతుంది.
అలాగే శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి.ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి.
పావు గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
ఈ ప్యాక్ చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది.తద్వారా మోచేతుల నలుపు తగ్గడంతో పాటు.మృదువుగా కూడా మారుతుంది.
బియ్యంపిండిలో కొద్దిగా రోజ్‌వాటర్ మిక్స్ చేసి.మోచేతులకు అప్లై చేయాలి.
పది నిమిషాల పాటు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇక బేకింగ్ సోడా కూడా మోచేతుల నలుపు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
కాబట్టి, కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని.అందులో కొద్దిగా వాటర్ మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి.పావుగంట పాటు ఆరనివ్వాలి.
అనంతరం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కూడా మోచేతుల వద్ద నలుపు తగ్గి.
స్మూత్‌గా మారతాయి.