ఈ సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే పొడవాటి కనురెప్పలు మీసొంతం!

పొడ‌వాటి క‌నురెప్ప‌లు.క‌ళ్ల‌ను, ముఖాన్ని మ‌రింత అందంగా చేసి చూపిస్తాయి.

 Simple Tips To Get Long Lashes , Simple Tips , Long Lashes , Eye Lashes , Latest-TeluguStop.com

అందుకే అమ్మాయిలంద‌రూ క‌నురెప్ప‌లు పొడ‌వుగా ఉండాల‌ని కోరుకుంటారు.ఒక‌వేళ అలా లేకుంటే కృత్రిమ ఐ ల్యాషెస్‌పై ఆధార‌ప‌డుతుంటారు.

అయితే ఇకపై మీరు వాటిని వాడాల్సిన ప‌ని లేదు.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ చిట్కాల‌ను పాటిస్తే సహ‌జంగానే మీ క‌నురెప్ప‌లు పొడుగ్గా పెరుగుతాయి.

మ‌రి ఇంకెందుకు లేటు ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.

Telugu Tips, Eye Lashes, Latest, Long Lashes, Simple Tips-Telugu Health Tips

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌లు వేసి ప‌ది నిమిషాల పాటు ఉడికిస్తే జెల్లీగా మారుతుంది.అప్పుడు స్ట‌వ్ ఆఫ్ చేసి.

గింజ‌లు రాకుండా జెల్‌ను మాత్రం స‌ప‌రేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజ‌ల జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ ఆముదం, వ‌న్ విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని మ‌స్కారా బ్రెష్ సాయంతో క‌నురెప్ప‌ల‌కు అప్లై చేయాలి.ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే గ‌నుక క‌నురెప్ప‌లు స‌హ‌జంగానే పొడ‌వుగా, ఒత్తుగా పెరుగుతాయి.

అలాగే మ‌రో విధంగా కూడా క‌నురెప్ప‌ల‌ను పొడ‌వుగా పెంచుకోవ‌చ్చు.అందుకోసం చిన్న గిన్నె తీసుకుని అంద‌లో రెండు టేబ‌ల్ స్పూన్ల అవిసె గింజ‌ల జెల్‌, వ‌న్ టేబ‌ల్ స్పూన్ తేనె, వ‌న్ విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్ వేసి అన్నీ క‌లిసేలా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని నిద్ర‌పోవ‌డానికి అర గంట ముందు మ‌స్కారా బ్రెష్ సాయంతో క‌నురెప్ప‌ల‌ను ప‌ట్టించాలి.ఉద‌యాన్నే నార్మ‌ల్ వాట‌ర్‌తో స్మూత్‌గా క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube