దంతాలు ఆరోగ్యంగా.దృఢంగా ఉండడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నిజానికి దంతాలు హెల్తీగా ఉన్నప్పుడే.మనం కూడా హెల్తీగా ఉండగలం.
వాటి విషయంలో కాస్త అజాగ్రత్తగా వ్యవహరించినా.అనేక అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది.
అందుకే దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.అయితే దంతాలు దృఢంగా ఉండాలంటే కొన్ని టిప్స్‌ను ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
మరి అవేంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవడంతో పాటు సరైన టూత్ పేస్ట్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఉదయం లేవగానే చాలా మంది కాఫీ, టీలు తెగ తాగేస్తుంటారు.కానీ, అతిగా కాఫీ, టీలు తాగడం వల్ల దంతాలు, చిగుళ్లు తీవ్రంగా దెబ్బ తింటాయి.
అందుకే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదంటున్నారు నిపుణులు.అలాగే దంతాలను దృఢంగా మార్చడంలో అరటి పండు తొక్క గ్రేట్‌గా సహాయపడుతుంది.
ప్రతి రోజు అరటిపండు తొక్కను పళ్ల మీద ఒక నిమిషం పాటు రుద్దుకోవాలి.అనంతరం నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల అరటి తొక్కలోని పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పళ్లపై పేరుకుపోయిన మలినాలను తొలిగించడంతో పాటు దంతాల ఆరోగ్యానికి దోహదపడుతాయి. సీ ఫుడ్స్ అంటే చేపలు, రొయ్యలు, పీతలు వంటివి వారినికి కనీసం ఒకసారి అయినా తీసుకోవాలి.
ఎందుకంటే.సీ ఫుడ్స్‌లో క్యాల్షియం మరియు ప్రాస్పరస్ పుష్కలంగా ఉంటుంది.ఇవి దంతాలను బలంగా మారుస్తాయి.స్ట్రాబెర్రీ, జామకాయలు, క్యారెట్స్, యాపిల్స్ వంటివి డైట్లో చేర్చుకోవాలి.
వీటిలో ఉండే పోషకాలు దంతాలను దృఢంగా మారుస్తాయి.అలాగే విటమిన్ బి, విటమిన్ డి ఉండే ఆహారాలను తీసుకోవాలి.
అప్పుడే దంతాలతో పాటు చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.ఇక కూల్‌డ్రింక్స్, షుగర్‌తో తయారు చేసిన స్వీట్స్, పొగాకు, మద్యానికి దూరంగా ఉండాలి.
లేకుంటే దంతాలు బలహీనంగా మారతాయి.