బెల్లీ ఫ్యాట్ ను క‌రిగించే సింపుల్ టిప్స్ మీ కోసం!

బెల్లీ ఫ్యాట్ లేదా పొట్టచుట్టూ కొవ్వు‌.చాలా మందిని వేధిస్తున్న కామ‌న్ స‌మ‌స్య‌లో ఇది కూడా ఒక‌టి.

 Simple Tips For How To Lose Belly Fat! Simple Tips, Lose Belly Fat, Belly Fat, Latest News, Home Remedies, Health, Health Tips-TeluguStop.com

అతిగా తిన‌డం, ఒత్తిడి, కేల‌రీలు ఎక్కువ‌గా ఉండే ఫుడ్ తీసుకోవ‌డం, హార్మోన్ల మార్పులు.ఇలా అనేక‌ కార‌ణాల వ‌ల్ల పొట్ట ద‌గ్గ‌ర కొవ్వు ఏర్ప‌డుతుంటుంది.

పొట్టచుట్టూ కొవ్వు చేర‌డం వ‌ల్ల అంద‌హీనంగా క‌నిపిస్తుంటారు.అందుకే బెల్లీ ఫ్యాట్ క‌రిగించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

 Simple Tips For How To Lose Belly Fat! Simple Tips, Lose Belly Fat, Belly Fat, Latest News, Home Remedies, Health, Health Tips-బెల్లీ ఫ్యాట్ ను క‌రిగించే సింపుల్ టిప్స్ మీ కోసం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

న‌చ్చిన ఫుడ్‌కు దూరంగా ఉండ‌డం, చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేయ‌డం ఇలా ఎన్నో చేస్తారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే సులువుగా బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకోవ‌చ్చు.

అవేంటో ఓ లుక్కేసేయండి.బెల్లీ ఫ్యాట్ ను క‌రిగించుకోవాలి అని అనుకునేవారు ముందుగా.

అల్లం టీని డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.అల్లం టీ తీసుకోవ‌డం శ‌రీరంలో సహజంగా వేడిని పుట్టించి.

అధిక కేల‌రీల‌ను, కొవ్వును క‌రిగిస్తుంది.

అలాగే ప్ర‌తి రోజు ఉద‌యం నాన బెట్టిన బాదంను ఎనిమిది నుంచి ప‌ది వ‌ర‌కు తీసుకోవాలి.

ఎందుకంటే.బాదంలో ఉండే మెగ్నీషియం మజిల్ స్ట్రెంథ్‌ను పెంచుతుంది.

త‌ద్వారా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.మ‌రియు ఫైబ‌ర్ ఎక్కువ‌గా, కేల‌రీలు త‌క్కువ‌గా ఉండే బాదం తీసుకోవ‌డం ఎక్కువ స‌మ‌యం ఆకలి వేయ‌కుండా ఉంటుంది.

ప్ర‌తి రోజు ఉద‌యం లేదా రాత్రి స‌మ‌యంలో ఒక క‌ప్పు గ్రీన్ టీ తీసుకోవాలి.గ్రీన్ టీ బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా క‌రిగిస్తుంది.

అలాగే నైట్ టైమ్ రైస్‌కు బ‌దులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి.త‌ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

ప్ర‌తి రోజు నీరు ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది.శ‌రీరానికి స‌రిప‌డా నీరు అందిన‌ప్పుడే టాక్సిన్స్ తొలగి.

పొట్ట చుట్టు కొవ్వు క‌రుగుతుంది.అదే విధంగా.

అవకాడో, పైనాపిల్, పుచ్చకాయ, నిమ్మ‌, క్యారెట్, వంటివి డైట్‌లో చేర్చుకోవ‌డంతో పాటు క్ర‌మం త‌ప్ప‌కుండా ఓ ఇర‌వై నిమిషాల పాటు వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్‌ను క‌రిగించుకోవ‌చ్చు.

Simple Tips For How To Lose Belly Fat! Simple Tips, Lose Belly Fat, Belly Fat, Latest News, Home Remedies, Health, Health Tips - Telugu Belly Fat, Tips, Latest, Lose Belly Fat, Simple Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube