సాధారణంగా చాలా మంది తమ చేతి గోళ్లు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకుంటారు.కానీ, అందుకు భిన్నంగా గోళ్లు ఉంటాయి.
గోళ్లు తరచూ విరిగిపోవడం, పొడవుగా పెరగకపోవడం, బలహీనంగా మారడం వంటి సమస్యలతో చాలా మంది బాధపడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.
మీ గోళ్లు పొడవుగా, బలంగా పెరుగుతాయి.తరచూ గోళ్లు విరిగిపోతుంటే.
అలాంటి వారు నిమ్మరసం తీసుకుని గోళ్లకు అప్లై చేయాలి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయడం వల్ల గోళ్లు విరగడం ఆగి.పొడవుగా, అందంగా పెరుగుతాయి.

గోళ్లు పెరుగుదల లేకపోతే.మీలో ఐరన్, క్యాల్షియం లోపం ఉన్నట్టే.అందుకే ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారంను మీ డైట్లో చేర్చుకోవాలి.తద్వారా గోళ్లు పొడవుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.
అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా గోళ్లకు బాదం నూనెను అప్లై చేయాలి.నూనె అప్లై చేశాక రెండు, మూడు నిమిషాల పాటు గోళ్లను రద్దుకోవాలి.
ఇలా ప్రతిరోజు చేయడం వల్ల బాదం నూనెలో ఉండే పోషకాలు గోళ్లను అందంగా, పొడవుగా పెరగేలా చేస్తాయి.
ఇక నీటిలో కొద్దిగా ఉప్పు మరియు షాంపు వేసి.
బాగా మిక్స్ చేయాలి.ఈ వాటర్లో గోళ్లను ముంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి.
అనంతరం చల్లటి నీటితో గోళ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల కూడా చేతి గోళ్లు పొడవుగా, దృఢంగా పెరుగుతాయి.