ఆడవారి అందాన్ని రెట్టింపు చేసే వాటిలో పెదవులు ముఖ్య పాత్ర పోషిస్తాయి.అందుకే అందమైన, మృదువైన, ఎర్రటి పెదవులు కావాలని కోరుకుంటారు.
కానీ, అందుకు భిన్నంగా పెదవులు పొడిబారిపోయి, నల్లగా మారుతుంటాయి.ఇలాంటి పెదవులు కలవారు ఎంత అందంగా ఉన్నా.
అంద విహీనంగానే కనిపిస్తారు.అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తే.
మీ పెదవులు ఎర్రగా, మృదువుగా మారడంతో పాటు మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.
ముందుగా.
ఒక బౌల్ తీసుకుని కొద్దిగా తేనె మరియు పంచదార వేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు స్క్రబ్ చేసి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల పెదవులపై ఉన్న మృతకణాలు పోయి.మృదువుగా మారతాయి.అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకుని రసం చేసుకోవాలి.
ఈ రసాన్ని పెదాలకు అప్లై చేసి.పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల నల్లటి పెదవులు. ఎర్రగా మారతాయి.గులాబి రేకులను పాలలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌ను పెదాలకు పట్టించి పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే పెదవులు తేమగా మరియు మృదువుగా ఉంటాయి.
అలాగే ప్రతిరోజు నిద్రించే ముందు పెదవులకు ఆలివ్ ఆయిల్ అప్లై చేసి పడుకోవాలి.
ఇలా కూడా పెదాలు అందంగా మారతాయి.ఇక క్యారెట్ రసాన్ని, బీట్‌రూట్ రసాన్ని మిక్స్ చేసి పెదాలకు అప్లై చేయాలి.
అరగంట పాటు ఆరనిచ్చి.అనంతరం చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల పెదవులు ఎర్రగా మారతాయి.