ప్రసాద్ పథకానికి సింహాచలం దేవస్థానం ఎంపిక..!  

simhachalam temple, appana swamy, prasad project, PM modi, central minister prahlad singh patel, mansas trust chairman sanchaitha gajapathi raju - Telugu Appana Swamy, Central Minister Prahlad Singh Patel, Mansas Trust Chairman Sanchaitha Gajapathi Raju, Pm Modi, Prasad Project, Simhachalam Temple

ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం దేవస్థానం కేంద్ర పర్యాటక శాఖ మౌలిక వసతుల అభివృద్ధి పథకానికి ఎంపిక అయింది.ఈ నేపథ్యంలో నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రిమేజ్ రెజువినేషన్ అండ్ స్పిర్చువల్ అజ్‎మెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) పథకానికి సింహాచల దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖకు కేంద్రం సమాచారం అందించింది.

 Simhachalam Temple Appana Swamy Prasad Project Pm Modi

11వ శతాబ్దానికి చెందిన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ అభివృద్ధికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పర్యావరణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.కాగా, దేశంలో ముఖ్యమైన పర్యాటక, ఆధ్యాత్మిక, ధార్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రసాద్ పథకాన్ని అమలు చేస్తోంది.ఇప్పటికే రాష్ట్రంలోని శ్రీశైలం, తిరుపతి దేవస్థానాలను ఈ పథకం కింద ఎంపిక చేసి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తోంది.

ప్రసాద్ పథకానికి సింహాచలం దేవస్థానం ఎంపిక..-Devotional-Telugu Tollywood Photo Image

ప్రసాద్ పథకం కింద ఎంపిక చేసినందుకు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రాజు ప్రధాని మోదీకి, మంత్రి ప్రహ్లాద్ పటేల్ కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.సింహాచలం అప్పన్న భక్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్టర్ లో పేర్కొంది.ప్రసాద్ పథకం కింద దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఐదింటిని ఎంపిక చేశారని.అందరం కలిసి సింహాచలం ఆలయాన్ని గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.

#Appana Swamy #PM Modi #Prasad Project

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

Simhachalam Temple Appana Swamy Prasad Project Pm Modi Related Telugu News,Photos/Pics,Images..

DEVOTIONAL